గుంటూరు జిల్లా కారంపూడి మండల వైకాపా జడ్పీటీసీ ఏకగ్రీవ అభ్యర్థి షేక్ ఇమామ్ సాహెబ్ గుండెపోటుతో మరణించాడు. నెల రోజుల క్రితం గుండెపోటు రాగా.. నరసారావుపేట ఆస్పత్రిలో చికిత్స పొందారు. నిన్న సాయంత్రం మరోసారి గుండెపోటుకు గురైన సాహెబ్‌ను కుటుంబసభ్యులు కారంపూడిలోని ఆస్పత్రికి తీసుకెళ్లారు.
అప్పటికే సాహెబ్ మరణించినట్లు వైద్యులు తెలిపారు. మృతునికి భార్య ముంతాజ్, కుమారుడు, కుమార్తె ఉన్నారు. మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి, మండల వైకాపా నాయకులు ఆయన మృతిపై సంతాపం ప్రకటించారు.
ఇదీ చదవండి: