ETV Bharat / state

YS Jagan Review: టేక్‌ హోం రేషన్‌ సరుకులన్నీ నాణ్యంగా ఉండాలి: సీఎం జగన్​

YS Jagan review meeting: మహిళాభివృద్ధి, శిశుసంక్షేమ శాఖలపై సీఎం వైఎస్ జగన్‌ సమీక్షా సమావేశం నిర్వహించారు. వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ, పోషణ ప్లస్‌ కింద ఇచ్చే టేక్‌ హోం రేషన్‌ సరుకులన్నీ అత్యంత నాణ్యంగా ఉండాలని సూచించారు. పీపీ–1, పీపీ–2 తరగతుల విద్యార్థులకు ఇచ్చే పాఠ్యప్రణాళికపైనా ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. అంగన్‌వాడీలను అన్నిరకాలుగా అభివృద్ధి చేయాలన్న సీఎం.. తరగతి గదులు, టాయిలెట్లు, రక్షిత తాగునీరు, ఫర్నిచర్‌ సహా వసతులు కల్పించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

YS Jagan review meeting
YS Jagan review meeting
author img

By

Published : Jul 3, 2023, 10:18 PM IST

YS Jagan review on Women and Child Welfare Dept: వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ, పోషణ ప్లస్‌ కింద ఇచ్చే టేక్‌ హోం రేషన్‌ సరుకులన్నీ అత్యంత నాణ్యంగా ఉండాలని అధికారులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశించారు. సరుకుల పంపిణీపై మంచి ఎస్‌ఓపీ పాటించాలని అధికారులకు సూచించారు. క్వాలిటీ సర్టిఫికేషన్‌ తప్పనిసరిగా ఉండాలని సీఎం జగన్ పేర్కొన్నారు. మహిళాభివృద్ధి, శిశుసంక్షేమశాఖలపై సీఎం వైఎస్ జగన్‌ సమీక్ష నిర్వహించారు. పంపిణీలో ఎలాంటి లోపాలు లేకుండా చూడాలని వెల్లడించారు. అర్హులైన వారందరికీ అందేలా ఎస్‌ఓపీ పాటించాలని అధికారులను నిర్దేశించారు. దీనికి సంబంధించి అందుబాటులో ఉన్న సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడుకోవాలని సూచించారు. ఆయా పథకాలపై నిర్లక్ష్యం వహించకుండా చూసుకోవాలని అధికారులను ఆదేశించారు.

అంగన్‌వాడీ టీచర్ల డివైజ్‌లో స్పోకెన్‌ ఇంగ్లిషు తరగతులు : పీపీ–1, పీపీ–2 తరగతుల విద్యార్థులకు ఇచ్చే పాఠ్యప్రణాళికపైనా ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. పదాలు పలికేతీరు, ఫొనిటెక్స్‌ తదితర అంశాలపై శ్రద్ధ పెట్టాలన్నారు. పిల్లలు త్వరగా నేర్చుకునే వయసు కాబట్టి వారికి అత్యుత్తమ బోధన అందించాలని జగన్ సూచించారు. అంగన్‌వాడీ టీచర్ల డివైజ్‌లో స్పోకెన్‌ ఇంగ్లిషుకు సంబంధించి పాఠ్యాంశాలను లోడ్‌ చేయాలని సీఎం పేర్కొన్నారు. తద్వారా వివిధ పదాలను ఎలా ఉచ్ఛరించాలన్న దానిపై పిల్లలకు తగిన శిక్షణ ఇచ్చినట్టు అవుతుందని సీఎం పేర్కొన్నారు. దీనిపై మంచి ఆలోచనలు చేసి.. వాటిని కార్యరూపంలోకి తీసుకురావాలని జగన్ వెల్లడించారు. తద్వారా ఇప్పుడున్న బోధనా పద్ధతులను మరింత బలోపేతం చేయాలన్నారు.

నాడు – నేడు ఫేజ్‌–2 పనులు: అంగన్‌వాడీ సెంటర్లలో నాడు – నేడు పనులపైనా సీఎం సమీక్షించారు. అంగన్‌వాడీలను అన్నిరకాలుగా అభివృద్ధి చేయాలన్న సీఎం.. తరగతి గదులు, టాయిలెట్లు, రక్షిత తాగునీరు, ఫర్నిచర్‌ సహా వసతులు కల్పించాలన్నారు. నాడు – నేడు ఫేజ్‌–2 లో భాగంగా ఈ పనులను పూర్తి చేయాలని సీఎం వెల్లడించారు. ఆగస్టు 15 నాటికి అంగన్ వాడీ కేంద్రాల్లో ఫేజ్ 2 పనులు ప్రారంభం కావాలని అధికారులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశాలు జారీ చేశారు. స్కూళ్లలో చేపడుతున్న పనులతో పాటు వీటిని పూర్తి చేయాలని ఆదేశించారు. చిల్డ్రన్‌ హోమ్స్‌లో సిబ్బంది కొరత లేకుండా చూడాలని సీఎం జగన్ పేర్కొన్నారు. ఈ హోమ్స్‌ నిర్వహణకు సంబంధించి సిబ్బందికి తర్పీదు ఇవ్వాలన్నారు. చిల్డ్రన్‌ హోమ్స్‌లో పిల్లలకు మంచి శిక్షణ, బోధనాంశాలు ఉండేలా చూడేలా చర్యలు చేపట్టాలని సూచించారు. ఈ హోమ్స్‌లో పరిస్థితులు మరింత మెరుగుపడేలా చూడాలన్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.