పనికి వెళ్లటం లేదని తండ్రి మందలించాడనే మనస్తాపంతో యువకుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఇది గమనించిన కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటన గుంటూరు జిల్లా ఫిరంగిపురం మండలం వేములూరిపాడులో జరిగింది.
గ్రామానికి చెందిన పచాల యోహాను మూడో కుమారుడు చందు.. స్థానికంగా కంపెనీలో పనికి వెళ్లేవాడు. కొద్ది రోజులుగా చందు పనికి వెళ్లకపోవటంతో.. యోహాను మందలించాడు. దీంతో మనస్తాపం చెందిన చందు.. ఇంటిలో ఉన్న గడ్డి మందును తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఇది గమనించిన కుటుంబ సభ్యులు గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చందు అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు.
ఇదీ చదవండి: పేకాట స్థావరాలపై పోలీసుల దాడి.. 34 మంది అరెస్ట్