ఆసియా ఖండంలోనే అతిపెద్ద మార్కెట్‌గా పేరొందిన... గుంటూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్‌గా చంద్రగిరి ఏసురత్నం బాధ్యతలు చేపట్టారు. గుంటూరు మిర్చియార్డు ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఆయన ప్రమాణ స్వీకార కార్యక్రమానికి... మంత్రులు మేకతోటి సుచరిత, మోపిదేవి వెంకటరమణ రావు, శ్రీరంగనాథ రాజు, ఎంపీ శ్రీకృష్ణ దేవరాయలు, ఎమ్మెల్యేలు హాజరయ్యారు. డీఐజీగా విధులు నిర్వహించి... తక్కువ కాలంలోనే రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకున్న నాయకుడు చంద్రగిరి ఏసురత్నం అని మంత్రి మోపిదేవి కొనియాడారు. ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేసి రైతులను ఆదుకునేలా సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారని వివరించారు. ఈ ఛైర్మన్ పదవి... ఎమ్మెల్యే స్థాయికి సమానమని అని మంత్రి శ్రీరంగనాథ రాజు వ్యాఖ్యానించారు. అన్ని మార్కెట్ యార్డ్‌ల్లో... ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు అధిక ప్రాధాన్యం కల్పించిన ఘనత సీఎం జగన్‌కే దక్కుతుందని మంత్రి సుచరిత పేర్కొన్నారు. వైకాపా ప్రభుత్వం రైతులకు ఎల్లప్పుడూ అండగా నిలుస్తోందని పేర్కొన్నారు.
ఇదీ చూడండి: కృష్ణా, గుంటూరులో అర్ధరాత్రి భూ ప్రకంపనలు.. ఆందోళనలో ప్రజలు