ప్రభుత్వంపై తెదేపా అధినేత చంద్రబాబు విష ప్రచారం చేస్తున్నారని వైకాపా నేతలు ఆరోపించారు. సీఎం జగన్ పై సామాజిక మాధ్యమాలలో తెదేపా తప్పుడు ప్రచారం చేస్తూ... వైకాపాపై నిందలు వేస్తుందని విమర్శించారు. గుంటూరు జిల్లా తాడేపల్లి వైకాపా ప్రధాన కార్యాలయంలో ఆ పార్టీ నేతలు సి. రామచంద్రయ్య, ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ మాట్లాడారు. చంద్రబాబు రాజకీయాల నుంచి తప్పుకునే సమయం ఆసన్నమైందని రామచంద్రయ్య వ్యాఖ్యానించారు. చంద్రబాబే వ్యూహాత్మకంగా తెదేపా నేతలను భాజపాలోకి పంపించారన్నారు. సామాజిక మాధ్యమాలపై తెదేపా చేస్తున్న ఆరోపణలపై చర్చించేందుకు సిద్ధంగా ఉన్నానని శాసనసభ్యుడు టీజేఆర్ సుధాకర్ చెప్పారు.
ఇదీ చదవండి :