ఏపీలో నాలుగు రాజ్యసభ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో అధికార పార్టీ సత్తా చాటింది. వైకాపా నుంచి పోటీకి దిగిన నలుగురూ ఎన్నికల్లో గెలుపొందారు. ఈ సందర్భంగా రాజ్యసభ సభ్యుడిగా మంత్రి మోపిదేవి వెంకటరమణ రావు విజయం సాధించడంపై రేపల్లే నియోజకవర్గ వైకాపా నాయకులు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు. పార్టీ కార్యాలయంలో కేక్ కట్ చేసి ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. మంత్రిగా రాష్ట్రంలో తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారని రేపల్లె వైకాపా నాయకులు కొనియాడారు. తీర ప్రాంతమైన రేపల్లె నియోజకర్గంలో ఎన్నో అభివృద్ధి పనులు చేశారన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రతి ఒక్కరికీ అందజేసేలా కృషి చేశారన్నారు. పశు సంవర్ధక, మత్స్య శాఖలలో నూతన పథకాలను ప్రవేశ పెట్టి కొత్త నిర్మాణాలకు పునాది వేశారని చెప్పారు. రానున్న రోజుల్లో మరిన్ని అభివృద్ధి పనులు చేసేందుకు మంత్రి మోపిదేవి సిద్ధంగా ఉన్నారని... నిరంతరం ప్రజల సంక్షేమం కోసమే ఆయన పాటుపడతారని కార్యకర్తలు కొనియాడారు.
ఇదీ చూడండి: రాజ్యసభ ఎన్నికలు: వైకాపా అభ్యర్థులు విజయం
రాజ్యసభ సభ్యుడిగా మంత్రి మోపిదేవి విజయంపై నేతల హర్షం - Rajya Sabha Election Latest News
రాజ్యసభ సభ్యుడిగా మంత్రి మోపిదేవి వెంకటరమణ రావు విజయం సాధించడంపై గుంటూరు జిల్లా రేపల్లె నియోజకవర్గ వైకాపా నాయకులు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పార్టీ కార్యాలయంలో కేక్ కట్ చేసి, టపాసులు కాల్చి ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.
![రాజ్యసభ సభ్యుడిగా మంత్రి మోపిదేవి విజయంపై నేతల హర్షం రాజ్యసభ సభ్యుడిగా మంత్రి మోపిదేవి విజయంపై నేతల హర్షం](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7687646-1041-7687646-1592576228010.jpg?imwidth=3840)