ETV Bharat / state

YCP Government Scam in Payment of Bills: ఏపీ సర్కార్ బిల్లుల చెల్లింపుల స్కాం.. ఆ నలుగురే! ఇష్టారాజ్యంగా నిబంధనలు ఉల్లంఘన.. - AP Latest News

YCP Government Scam in Payment of Bills: ఏపీలో కాంట్రాక్టర్ల బిల్లుల చెల్లింపుల్లో కుంభకోణం చోటుచేసుకుందా..? జరుగుతున్న పరిణామలను చూస్తే,.. అది నిజమే అనిపిస్తోంది. వరుసలో ఎక్కడ ఉన్నా.. మనకు రావల్సింది వచ్చి చేరుతుందన్నట్లు.. వ్యవహారాాలు సాగుతున్నాయి. ఈ మొత్తం తతంగంలో ఆ నలుగురే కీలకపాత్ర పోషిస్తున్నారని సమాచారం. ఏపీలో నాలుగేళ్లుగా జరుగుతున్న ఈ అక్రమాలకు అంతేలేకుండా పోయిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

ycp_government_scam
ycp_government_scam
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 4, 2023, 10:41 AM IST

Updated : Oct 4, 2023, 11:31 AM IST

YCP Government Scam in Payment of Bills: ఏపీ సర్కారులో బిల్లుల చెల్లింపు వ్యవహారం ఇష్టారీతిన సాగిపోతోంది. మంత్రికి చెందిన నిర్మాణ ఏజెన్సీా, ఎంపీ కాంట్రాక్టు సంస్థ బిల్లులను ఎట్టిపరిస్థితుల్లోనూ ఆపొద్దని ముఖ్యుల నుంచి ఆదేశాలు వెలువడడమే తరువాయి చెల్లింపులు జరిగిపోతాయి. పొరుగు రాష్ట్రానికి చెందిన మాజీ ఎంపీకి చెందిన సంస్థ అయితే మనకు సన్నిహితుడే తక్షణం బిల్లులు చెల్లించండనే ఆదేశాలూ జారీ అవుతాయి. ఇదీ ఆర్థిక శాఖలోని.. సీఎఫ్​ఎంఎస్​(CFMS) విభాగం వ్యవహరిస్తున్న తీరు. అధికార పార్టీ ప్రజాప్రతినిధికి చెందిన బిల్లులు అయితే చాలు అఘమేఘాల మీద చెల్లింపులు జరిగిపోతాయి. వరుసతో సంబంధం లేదు ప్రాధాన్యక్రమం లేదు. ఏళ్లతరబడి వేరే బిల్లులు పెండింగులో ఉన్నాయన్న బెంగ లేదు. అంతా ప్రభుత్వంలోని ముఖ్యమైన వ్యక్తుల ఇష్టారాజ్యం.

బిల్లుల చెల్లింపుల వ్యవహారంలో ప్రధానంగా నలుగురు కీలక పాత్ర పోషిస్తున్నారని తెలుస్తోంది. ఆదేశించేవారు, ఉల్లంఘించేవారు కూడా ఏ ప్రయోజనాలు పొందకుండానే ఈ క్రమం తప్పుతున్నారా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అఖిల భారత సర్వీసు అధికారులకు రాజ్యాంగం ద్వారా ఆర్టికల్‌ 309 కింద రక్షణ లభించింది. అయినా ఆర్థికశాఖలో ఉన్నతాధికారులు ఎందుకు ఈ అక్రమాలకు ఆజ్యం పోస్తున్నారు? ఆనక ఈ మొత్తం వ్యవహారానికి ఎవరు బాధ్యత వహిస్తారనే చర్చ సాగుతోంది.

YCP Govt Paying Bills Only Jagan Followers: 'వరుస' తప్పిన వైసీపీ సర్కారు..! పక్కదోవలో జగన్ అనుచరులకు వేల కోట్ల పందేరం

ఆంధ్రప్రదేశ్‌లో నాలుగేళ్లుగా సగటున ఏడాదికి దాదాపు 2 లక్షల కోట్ల రూపాయల మేర చెల్లింపులు జరుగుతున్నాయి. ఈ స్థాయిలో ప్రజాధనాన్ని చెల్లించే ఆర్థికశాఖ అధికారులు ఒక పకడ్బందీ వ్యవస్థ ప్రకారం నడుచుకోవాల్సిన అవసరం లేదా..? గతంలో సీఎఫ్​ఎంఎస్ ఉన్నప్పుడు అన్నీ పక్కాగా అందులో నమోదయ్యేవి. బిల్లుల చెల్లింపుల్లో వరుసక్రమం తప్పుతున్నారని బయటపడుతున్న నేపథ్యంలో ఇందుకు బాధ్యులు ఎవరనేది కీలకంగా మారింది. సీఎఫ్​ఎంఎస్​లో బిల్లులకు బాధ్యత వహించాల్సిన అధికారి కాకుండా మరో ఉన్నతాధికారి ద్వారా ప్రస్తుతం బిల్లుల చెల్లింపు వ్యవహారాలు సాగుతున్నాయనేది బహిరంగ రహస్యంగా మారింది. డిప్యుటేషన్‌పై రాష్ట్రానికి వచ్చి, వచ్చే ఆర్థిక సంవత్సరం ప్రారంభం కాకముందే ఆ డిప్యుటేషన్‌ పూర్తయ్యే అధికారి ప్రస్తుతం ఈ ఆర్థిక చెల్లింపుల్లో కీలకపాత్ర పోషిస్తున్నారు.

YCP Leaders Focus on Visakha Lands: 'రియల్‌' రంగంపై ప్రభావం చూపని రాజధాని ప్రకటనలు.. విశాఖలో మందగించిన భూకొనుగోళ్లు

మొదట వచ్చిన బిల్లు మొదట చెల్లించాలనేది ఆర్థికవ్యవస్థలో కీలక విధానం. ఈ ఫిఫోను ఆర్థికశాఖ ఉన్నతాధికారి ఎలా ఉల్లంఘిస్తారు..? ఆ పద్ధతి పాటిస్తే, తమ బిల్లు ఎప్పుడైనా అందుతుందనే విశ్వాసం గుత్తేదారులకు, సరఫరాదారులకు ఉంటుంది. ఇప్పుడు ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్న వారికి ఎప్పటికి బిల్లులు దక్కుతాయో తెలియదు. దొడ్డిదారిలో అందుకుంటున్నవారు ఎందరో. దీనిపై కేంద్రానికి ఫిర్యాదులు వెళ్లినా మార్పు రాలేదు. రాష్ట్రవ్యాప్తంగా కొన్ని వందలమంది చిన్న గుత్తేదారులు పెండింగ్‌ బిల్లుల కోసం కాళ్లరిగేలా తిరుగుతున్నా బడా కాంట్రాక్టు సంస్థలకే పెద్ద మొత్తంలో బిల్లుల పందేరం చేసిన ఉదంతాలున్నాయి. ఈ ఏడాది జూన్‌లో మూడు బడా కాంట్రాక్టు సంస్థలకే సుమారు 15 వందల కోట్ల బిల్లులు చెల్లించేశారు. అప్పటికే చిన్న గుత్తేదారులు బిల్లుల కోసం గగ్గోలు పెడుతున్నారు. వారిలో కొందరు హైకోర్టును ఆశ్రయించి వందల సంఖ్యలో కేసులు వేశారు.

TDP on IPAC Organization సొమ్ము సర్కార్​ది.. ప్రచారం పార్టీకి! ఐప్యాక్ కు 274కోట్లు దోచిపెట్టిన జగన్..

క్రమం తప్పి కొందరికే బిల్లులు అందడంపై బాధితులే అనేక అంశాలు సేకరిస్తున్నారు. స్టేట్‌ రోడ్డు డెవలప్‌మెంట్‌ ఫండ్‌ నిధులతో చేపట్టిన పనుల్లో వరుస క్రమం తప్పి ఈ ఏడాది జూన్‌, జులై నెలల్లో ఆ తర్వాతి బిల్లులు చెల్లించిన ఉదంతాలు ఉన్నాయి. 2022 నవంబర్ నుంచి 2023 జనవరి వరకు ఆమోదం పొందిన బిల్లులు వరుస క్రమంలో 12 పెండింగులో ఉండగానే 2023 జనవరి చివర్లో, ఫిబ్రవరిలో ఆమోదం పొందిన మూడు బిల్లులకు చెల్లింపులు చేసేశారు.

రోడ్ల నిర్మాణానికి సంబంధించి 53.94 కోట్లు చెల్లించాల్సి ఉండగానే, తమ అనుయాయులకు 4.76 కోట్ల రూపాయల బిల్లుల చెల్లింపులు జరిగిపోయాయి. ఆసియా మౌలికసౌకర్యాల కల్పన బ్యాంకు నిధులతో చేపట్టిన పనుల్లో మరో హెడ్‌ ఆఫ్‌ అకౌంట్‌లోనూ ఇలాగే వరుస తప్పి చెల్లింపులు జరిగిపోయాయి. ఇందులో దాదాపు 286 కోట్లు విలువైన బిల్లులు చెల్లించాల్సి ఉండగా అక్కడక్కడ ఉన్న 13 బిల్లుల కింద 25.39 కోట్ల మేర చెల్లించారు.

YCP Government Scam in Payment of Bills: ఏపీ సర్కార్ బిల్లుల చెల్లింపుల స్కాం.. ఆ నలుగురే! ఇష్టారాజ్యంగా నిబంధనలు ఉల్లంఘన..

Last Updated : Oct 4, 2023, 11:31 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.