వైకాపా ఏడాది పాలనలో ప్రజలపై వేల కోట్ల రూపాయల భారం మోపిందని తెలుగుదేశం నేతలు మండిపడ్డారు. అధిక ధరలు, ప్రజలపై 50 వేల కోట్ల భారం పేరిట మాజీ ఎమ్మెల్యే జయనాగేశ్వర్ రెడ్డి మహానాడులో తీర్మానం ప్రవేశపెట్టగా కోట్ల సుజాతమ్మ బలపరిచారు. విద్యుత్, మద్యం, ఇసుక, పెట్రోల్ ధరలు ఆకాశాన్నంటాయని వారు దుయ్యబట్టారు. కరోనా విపత్తులోనూ విద్యుత్ బిల్లులను ప్రజల నుంచి ముక్కు పిండి వసూలు చేస్తున్నారని ఆక్షేపించారు. నిత్యావసర వస్తువుల ధరలు కొండెక్కితే ఉచిత ఇసుకను రద్దు చేసి కోట్లు కొల్లగొడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుమల శ్రీవారి కొండపై వసతి గృహాల ధరలు కూడా పెంచేశారంటూ నేతలు మండిపడ్డారు.
ఇదీ చదవండి