రాష్ట్ర ప్రభుత్వం తమ తప్పిదాలను కప్పిపుచ్చుకునేందుకే.. ప్రశ్నించిన వారిపైన అన్యాయంగా కేసులు పెడుతోందని మాజీ ఎమ్మెల్యే, తెదేపా నేత యరపతినేని శ్రీనివాసరావు అన్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టినందుకు 60 ఏళ్లు పైబడిన వృద్ధురాలికి అరెస్టు నోటీసులు జారీ చేసిన వైనంపై మండిపడ్డారు. బాధితురాలు రంగనాయకమ్మను ఆయన పరామర్శించారు.
గత ముఖ్యమంత్రి చంద్రబాబు మీద ఎన్నో సార్లు కాల్చాలి, బట్టలూడదీయాలని బహిరంగంగా మాట్లాడిన జగన్ పై ఎన్ని కేసులు పెట్టాలని యరపతినేని ప్రశ్నించారు. వైకాపా నేతలు అక్రమ కేసులు పెట్టి ఆనందం పొందుతున్నారని చెప్పారు. రంగనాయకమ్మపై సిఐడీ కేసు పెట్టడం జగన్ దుర్మార్గానికి పరాకాష్టని మండిపడ్డారు. తక్షణమే ఆ కేసులు కొట్టివేయాలని ఆయన డిమాండ్ చేశారు.
సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ళ నాగేశ్వరరావు కూడా.. రంగనాయకమ్మను పరామర్శించారు. నేర చరిత్ర ఉన్న వ్యక్తి ముఖ్యమంత్రి అయితే ఇలాంటి పరిస్థితులే ఏర్పడతాయని అభిప్రాయపడ్డారు. ఈ ప్రభుత్వంలో ఉన్న పోలీసులను తప్పుబట్టడం లేదని.. వారిచేత ఇలాంటి కేసులు పెట్టేంచే వారినే తప్పుబడుతున్నామని అన్నారు.
ఇదీ చదవండి: