కృష్ణా జిల్లా గుడివాడ పట్టణానికి చెందిన సాహిత్య అనే యువతి... తెనాలి మండలంలోని కంచర్లపాలెం గ్రామానికి చెందిన ఓ వ్యక్తిని ప్రేమించి వివాహం చేసుకుంది. ఆమె బలవన్మరణానికి పాల్పడింది. సాహితి భర్త మద్యానికి బానిసయ్యాడని, అత్తమామలు వేధింపులకు గురి చేశాడని బాధితులు ఆరోపించినట్టు పోలీసులు తెలిపారు.
నిన్న జరిగిన గొడవతో మనస్థాపానికి గురైన సాహితి.. ఆత్మహత్య చేసుకున్నట్టు తెలిసిందన్నారు. బాధిత కుటుంబం ఫిర్యాదు మేరకు సాహితి భర్త కుటుంబీకులపై గృహహింస, ఆత్మహత్యకు ప్రేరేపించారన్న సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు వివరించారు. శవపరీక్ష నిమిత్తం మృతదేహాన్ని తెనాలి ప్రభుత్వ వైద్యశాలకు తరలించామన్నారు.
ఇదీ చదవండి: