న్యాయస్థానాలు లేకపోతే తమకు ఆత్మహత్యలే శరణ్యమని రాజధాని రైతులు చెప్పారు. గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం దీక్షా శిబిరంలో మహిళలు వినూత్న రీతిలో నిరసన తెలియజేశారు. న్యాయదేవత అవతారంలో తాసు పట్టుకొని నిరసన తెలిపారు. రెండు వందల నలభై రోజులుగా తమను న్యాయస్థానాలు రక్షిస్తున్నాయి అని రైతులు చెప్పారు. అలాంటి న్యాయదేవత పై అధికార పార్టీ నేతలు విమర్శలు చేయడానికి రైతులు తప్పుపట్టారు. న్యాయస్థానంలో శుక్రవారం తమకు న్యాయం జరుగుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు.
ఇవీ చదవండి