గుంటూరు జిల్లా మాచవరం తహసీల్దార్ కార్యాలయానికి ఓ మహిళా రైతు తాళం వేసింది. డీటీ, ఇతర రెవెన్యూ ఉద్యోగులు కార్యాలయం లోపలే ఉండిపోయారు. మే 11న పొలం కొలతల కోసం లక్ష్మీ అనే మహిళ అర్జీ పెట్టుకుంది. కార్యాలయం చుట్టూ ఎన్నిసార్లు తిరిగినా... ఎవరూ స్పందించడం లేదని మహిళా రైతు ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఇప్పటికీ అధికారులు స్పందించలేదని ఆరోపిస్తోంది. రిజిస్ట్రేషన్ ప్రకారం తన భూమిని క్షేత్రస్థాయిలో చూపాలంటూ లక్ష్మమ్మ డిమాండ్ చేస్తోంది. తనకు న్యాయం జరిగే వరకు తాళం తీయనని గట్టిగా చెబుతోంది.
ఇదీ చదవండి: సుబ్బయ్య కుటుంబానికి తెదేపా సాయం రూ. 20 లక్షలు