గుంటూరు జిల్లా మాచవరం మండలం పిల్లుట్ల గ్రామంలో.. మద్యం విక్రయాలు వద్దని వైన్ షాప్ ఎదుట మహిళలు ధర్నా చేశారు. మద్యం దుకాణానికి పక్కనే ఉన్న గ్రామాలు, మండలాల నుంచి ప్రజలు వస్తున్నారని... ఇంతమంది జనం తమ ఊళ్లోకి వస్తే కరోనా వస్తోందని భయపడుతున్నారు. గ్రామంలోని ప్రస్తుత పరిస్థితిని ప్రొవిజినల్ సీఐ పరిశీలించారు. ప్రజలకు ఇబ్బందిగా ఉన్నటువంటి షాపును ప్రస్తుతం మూసి... ఇబ్బంది లేని చోట మద్యం అమ్మకాలు జరుపుతామని హామీ ఇవ్వడంతో ప్రజలు శాంతించారు.
ఇదీ చదవండి: 'రమ్మంటారా? ఇప్పుడే వస్తా....ఏం చేయమంటారో చెప్పండి...!