కరోనా భయంతో గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో ఓ వృద్ధురాలి అంత్యక్రియలకు ఆటంకం కలిగింది. జీజీహెచ్‌లో అనారోగ్యంతో మరణించిన వృద్ధురాలి మృతదేహాన్ని ఖననం చేయడానికి తీసుకెళ్తుండగా స్థానికులు అడ్డుకున్నారు. శ్మశానవాటికకు వెళ్లే రహదారిలో దుంగలను అడ్డుగా వేశారు. నిన్న రాత్రి నుంచి సత్తెనపల్లిలో ఈ విషయంపై వివాదం కొనసాగుతోంది. సమస్య పరిష్కారానికి వచ్చిన పోలీసులతోనూ స్థానికులు వాగ్వాదానికి దిగారు. తాజాగా జీజీహెచ్‌లో మరణించిన ముగ్గురికి ఆ తర్వాత వచ్చిన నివేదికల్లో కరోనా పాజిటివ్‌గా నిర్ధరణ అవ్వటంతో... తమ ప్రాంతంలో అలాంటి మృతదేహాలు పూడ్చవద్దని స్థానికులు అడ్డుకున్నారు.
ఇదీ చదవండి: