గుంటూరు జిల్లా తెనాలి పురపాలక సంఘం వైద్య విభాగంలో సీనియర్ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్న ఉద్యోగిని కరోనాతో మృతి చెందింది. ఈనెల 18న కరోనా పరీక్షలు చేయించుకోగా పాజిటివ్‌గా నిర్ధరణ అయ్యింది. మెరుగైన వైద్యం కోసం జీజీహెచ్‌లో చేరారు. గుంటూరు సర్వజన ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించిందని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి.
ఇవీ చూడండి...