కరోనా వ్యాప్తిని దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరూ భౌతిక దూరం పాటించాలని పదే పదే ప్రచారం చేస్తున్నా.. మద్యం ప్రియులకు పట్టడం లేదు. గుంటూరు జిల్లా తాడికొండ నియోజకవర్గం ఫిరంగిపురం మద్యం దుకాణాల వద్ద మందుబాబులు బారులు తీరారు. కనీస దూరం పాటించలేదు. మాస్కులు కట్టుకోలేదు. లైన్లో కిక్కిరిసి ఒకరినొకరు తోసుకుంటూ మందు కోసం ఎగబడ్డారు. కరోనా కారణంగా లాక్ డౌన్ తో ఇన్నాళ్లూ దుకాణాలు మూసివేశారు.
ప్రభుత్వ ఆదేశాల మేరకు మంగళవారం మద్యం దుకాణాలు తెరిచారు. ముందుగా 25 శాతం ధరలు పెంచారు. ధరలు పెంచినా మద్యం అమ్మకాలు తగ్గలేదు. దుకాణం వద్ద మందుబాబుల తాకిడి ఎక్కువగా ఉంది. తాకిడిని అరికట్టేందుకు రెండవసారి మద్యం ధరలు 50 శాతం పెంచారు. అయినా రద్దీ తగ్గడం లేదు. దీంతో వైరస్ వ్యాప్తి చెందే అవకాశం ఉందని సామాన్యులు ఆవేదన చెందుతున్నారు.
ఇవీ చదవండి: