విద్యార్థుల ఫీజు బకాయిలను త్వరలోనే చెల్లిస్తామని మంత్రి మేకతోటి సుచరిత స్పష్టం చేశారు. గుంటూరు జిల్లా ప్రత్తిపాడులో డ్వాక్రా మహిళలకు సున్నా వడ్డీ రుణాలకు సంబంధించిన చెక్కులను పంపిణీ చేశారు. విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ నగదు కూడా తల్లి ఖాతాలో జమచేస్తామన్నారు. పేదలకు ఉగాది నాటికి ఇవ్వాల్సిన ఇళ్ల స్థలాలు కరోనా వల్ల ఆలస్యమైందని.. అన్ని సక్రమంగా జరిగితే జులై 2 నాటికి ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తామన్నారు.
ఇదీచదవండి