గుంటూరు చుట్టగుంటలోని రైతు బజార్లో కేజీ ఉల్లిపాయలు రూ.40 రూపాయలకే అందించడంతో నగరవాసులు ఉల్లిని కొనేందుకు ఆసక్తి చూపుతున్నారు. బయట మార్కెట్లో ధరలు అధికంగా ఉన్నాయని రైతు బజార్లో ప్రభుత్వం అందిస్తున్న ఉల్లిపాయలు చౌక ధరకే లభిస్తున్నాయని స్థానికులు అంటున్నారు. ఒక్కో వ్యక్తికి కేజీ ఉల్లిపాయలు మాత్రమే ఇస్తున్నారని రెండు కేజీలు ఇస్తే బాగుంటుందని కోరుతున్నారు.
5 క్యూ లైన్లు ఏర్పాటు..
ఉల్లిపాయలు కోసం రైతు బజార్‌కి వచ్చే కొనుగోలుదారులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా 4 క్యూలైన్లు ఏర్పాటు చేసినట్లు చుట్టగుంట రైతు బజార్ ఎస్టేట్ ఆఫీసర్ స్వప్న తెలిపారు. ప్రస్తుతం 3 వేల కేజీలు ఉల్లిపాయలు ఉన్నాయని అందులో ఇప్పటివరకూ సగం అమ్మినట్లు పేర్కొన్నారు.
సిద్ధంగా ఉన్నాం..
ప్రజల రద్దీ దృష్ట్యా కావాల్సిన స్టాక్‌ను నిల్వ ఉంచడానికి అధికారులు సిద్ధంగా ఉన్నట్లు వివరించారు. రూ. 40 రూపాయల రాయితీ ధరకే ఉల్లిపాయలు అందిస్తున్నందున క్రమంగా జనం ఎక్కువ సంఖ్యలో వచ్చే అవకాశం ఉందన్నారు. ప్రజల రద్దీ దృష్ట్యా ఉల్లిపాయలు సరఫరా చేయడానికి సిద్ధంగా ఉన్నామన్నారు.