గుంటూరు జిల్లాలోని నాగార్జున సాగర్ జలాశయంలో నీటికుక్కలు సందడి చేస్తున్నాయి. వర్షాల కారణంగా వరదనీరు వచ్చి సాగర్లో చేరుతోంది. ఈ క్రమంలో నీటికుక్కలు బయటకు వచ్చి గట్లపై తిరగాడుతున్నాయి. ఇవి జనసంచారం కనిపిస్తే నీటిలోకి వెళ్లిపోతాయి. అందుకే సందర్శకుల తాకిడి లేని ప్రాంతాల్లో మాత్రమే కనిపిస్తున్నాయి. అట్టర్స్గా పిలుచుకునే ఈ నీటి కుక్కలు అరుదైన జాతికి చెందిన జీవులు. ఇవి అంతరించిపోతున్న జీవుల జాబితాలో ఉన్నాయి.
ఇదీ చదవండీ.. YSR kapunestham: కాపు నేస్తం నిధులు విడుదల.. లబ్ధిదారుల ఖాతాల్లోకి రూ.490.86 కోట్లు