ETV Bharat / state

డ్రైవర్ అవసరం లేని ట్రాక్టర్.. పాతది ఉంటే 20 వేల రూపాయలకే

author img

By

Published : Feb 9, 2023, 7:33 PM IST

Kits Students Made Driverless Tractor: వ్యవసాయం రంగంలో కూలీల భారం రోజురోజుకూ పెరిగిపోతోంది. ట్రాక్టర్‌ ఉపయోగించి దుక్కిదున్నినా కొన్నిసార్లు అవి బోల్తాపడి డ్రైవర్‌ ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు చూస్తూనే ఉన్నాం. ఆ సమస్యలన్నీ దృష్టిలో పెట్టుకొని డ్రైవర్‌ రహిత ట్రాక్టర్‌ను ఆవిష్కరించారు.. వరంగల్‌ కిట్స్‌ కళాశాల విద్యార్థులు. ఆ వాహనం పనితీరును ఒక్కసారి చూద్దామా..

Driverless Tractor
మానవ రహిత ట్రాక్టర్​
మానవ రహిత ట్రాక్టర్​ను ఆవిష్కరించిన కిట్స్​​ విద్యార్థులు

Kits Students Made Unmanned Tractor: కంప్యూటర్‌ సైన్స్‌లో కృత్రిమ మేధ, ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌ లాంటి ఎన్నో పరిజ్ఞానాలు వస్తున్నాయని.. వ్యవసాయంలోనూ వాటిని ఉపయోగించుకుని ప్రయోజనాలు పొందవచ్చని వరంగల్‌ కిట్స్‌ కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు నిరూపిస్తున్నారు. అందులో భాగంగా మానవ రహిత ట్రాక్టర్‌ను ఆవిష్కరించారు. పొలంలో ఈ ట్రాక్టర్‌ను వదిలేసి కర్షకులు గట్టుమీద నీడలో కూర్చొని రిమోట్‌ సాయంతో నడపొచ్చు. గేర్లు అదే మార్చుకుంటుంది. ఎక్స్‌లేటర్‌ అదే ఇచ్చుకుంటుంది. స్టీరింగ్‌ దానంతట అదే ఎటువైపు తప్పినా తిరుగుతుంది. ట్రాక్టర్‌ వెనక్కి ముందుకు ఎటు కావాలంటే అటు రయ్​ రయ్​మని దూసుకెళుతుంది.

కేంద్ర శాస్త్ర, సాంకేతిక విభాగం కింద విడుదలైన నిధులను ఉపయోగించి విద్యార్థులు విజయవంతంగా ఈ మానవ రహిత ట్రాక్టర్​ను అభివృద్ధి చేశారు. డ్రైవర్‌ లేకుండా పని చేయడానికి ట్రాక్టర్‌కు మైక్రో కంట్రోలర్‌ అమర్చి, మనిషి లేకుండా క్లచ్, బ్రేకు, ఎక్స్‌లేటర్‌ తిరగడానికి మూడు యాక్చువేటర్స్‌ వాడారు. స్టీరింగ్‌ తిరిగేందుకు మరో మోటార్‌ అమర్చారు. డ్రైవర్‌ రహిత ట్రాక్టర్‌ను మొబైల్‌ నుంచే నియంత్రించేలా రూపొందించారు.

ఐవోటీ పరిజ్ఞానంతో సందేశం క్లౌడ్‌కు వెళుతుంది. అక్కడి నుంచి మొబైల్‌కు మనమిచ్చే ఆదేశాలు వస్తాయి. కాబట్టి ఇంట్లో, ఇతర ప్రాంతంలో ఉండి పొలం దగ్గర ట్రాక్టర్‌ను మొబైల్‌ ఫోన్‌తో నడిపించవచ్చని ఆవిష్కర్తలు చెబుతున్నారు. 45 హెచ్‌పీ ట్రాక్టర్‌పై క్యాంపస్‌లో ప్రయోగాలు చేయగా సమర్థవంతంగా నడుస్తోంది. ట్రాక్టర్‌ ఉన్న రైతులకు ఈ సాంకేతికత అమర్చుకోవాలంటే కేవలం రూ.20 వేలు ఖర్చు కానుందని ఆవిష్కర్తలు చెబుతున్నారు. వ్యవసాయరంగం రోజురోజుకూ కుదేలవుతున్న తరుణంలో ఈతరహా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో భవిష్యత్తులో సాంకేతికంగా సొగబులు అద్దుకుటుందని పలువురు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.

"విద్యార్థులను నూతన ఆవిష్కరణల వైపు విద్యావిధానం ద్వారా పంపాలని కేంద్ర ప్రభుత్వం సూచన చేసింది. నూతన ఆవిష్కరణలు చేసే విద్యార్థులను ప్రోత్సహిస్తుంది. డ్రైవర్​ లేకుండా ట్రాక్టర్​ను నడిపే విధానాన్ని తీసుకువచ్చాం. దీనికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలుపుతూ రూ.41 లక్షలు సహాయం అందించింది." - ఆచార్య కె. అశోక్‌రెడ్డి, కిట్స్ ప్రిన్సిపాల్​, వరంగల్‌

"2018లోనే డ్రైవర్​ లెస్​ కారును తయారు చేయాలని ఆలోచన మా కో ప్యాకల్టీ మెంబర్ల వల్ల కలిగింది. మా ఆలోచనను సైన్స్​ అండ్​ టెక్నాలజీ డిపార్టుమెంట్​కు 2019లో అప్లై చేశాం. 2020లో ఇది ఆమోదం పొందింది. రూ.41 లక్షలకు సెంట్రల్​ గవర్నమెంట్​ నుంచి మాకు ఫండింగ్​ వచ్చింది. దీనికి ఐవోటీ డివైజ్​ ఇచ్చి రైతులకు తక్కువ ఖర్చుతో ఈ మానవరహిత ట్రాక్టర్​ను ఇవ్వాలనుకున్నాం." - నిరంజన్​రెడ్డి, సీఎస్సీ డిపార్టుమెంట్​ హెడ్​

ఇదీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.