వైకాపా.. జనసేనల మాటల యుద్ధం.. తీవ్ర స్థాయికి చేరుకుంది. వైకాపా ప్రభుత్వంపై పవన్ వ్యాఖ్యలను ఖండిస్తూ మంత్రులు ఘాటుగా బదులిచ్చారు. అదే సమయంలోనే.. సినీ నటుడు పోసానీ మురళీకృష్ణ హైదరాబాద్‌లో ప్రెస్ మీట్‌తో సడెన్ ఎంట్రీ ఇచ్చారు. గంటకుపైగా మాట్లాడిన ఆయన.. పవన్‌పై విమర్శల వర్షం గుప్పిస్తూనే.. ప్రశ్నలను సంధించారు. ఆయన చేసిన వ్యాఖ్యలతో.. జనసేన శ్రేణులు కుతకుత ఉడికిపోయాయి. సోషల్ మీడియాలో విమర్శల వర్షం గుప్పించాయి. ఇంతలోనే పవన్ మరోసారి వైకాపా ప్రభుత్వంపై ట్విటర్ వేదికగా వ్యంగ్యాస్త్రాలు సంధించారు. 'గ్రామ సింహాలు ఎంట్రీ' ఇచ్చాయంటూ...సెటైర్లు వేశారు. జనసేన అభిమానులు.. తన కుటుంబసభ్యులను టార్గెట్ చేస్తూ... వేల సందేశాలు పంపారంటూ పోసాని మరోసారి మంగళవారం ప్రెస్‌మీట్ పెట్టారు. వ్యక్తిగతంగా కక్షకట్టి.. తన కుటుంబాన్ని వివాదంలోకి లాగొద్దని కోరారు. అక్కడే పోసానిపై పవన్ అభిమానులు దాడికి యత్నించటంతో.. తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోసానిని పోలీసు వాహనంలోనే పోలీసులు ఇంటికి చేర్చారు. పవన్ అభిమానుల నుంచి తనకు ప్రాణహాని ఉందని పోలీసులకు ఫిర్యాదు చేస్తానని పోసాని తెలిపారు.
పవన్ ట్వీట్లు.. సజ్జల కౌంటర్
పవన్ కల్యాణ్ ఒక ట్విట్ ద్వారా వైకాపా ప్రభుత్వంపై ఘాటు విమర్శలు చేశారు. "వైకాపా ప్రభుత్వ 'పాలసీ ఉగ్రవాదం' కి అన్ని రంగాలు, అన్ని వర్గాలు నాశనం అయిపోతున్నాయి. దీనిని ఎదుర్కోవలసిన సమయం ఆసన్నమయిందని.. పోస్ట్ చేశారు. పవన్ కల్యాణ్ చేసిన విమర్శలపై.. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఘాటుగా స్పందించారు. పవన్ గురించి సినీ పరిశ్రమలోనే వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని ఆరోపించారు. సినీ పరిశ్రమకు మంచి చేయాలని చూస్తున్నామని.. బురద చల్లాలని చూస్తే పవన్ కల్యాణ్‌కే ఇబ్బందిగా మారుతుందని వ్యాఖ్యలు చేశారు.
తాజా వివాదంపై పలు రాజకీయ పక్షాలు స్పందించాయి. పవన్‌కల్యాణ్‌పై వైకాపా నాయకుల వ్యాఖ్యలను ఖండిస్తున్నట్లు భాజపా రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు తెలిపారు. తిట్ల తుపానుకు తెరదించి గులాబ్ తుపానుపై వైకాపా శ్రద్ధ పెట్టాలని హితవు పలికారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్(pawan kalyan)కు రైతుల ఉద్యమాలు కనిపించడం లేదా? అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ(cpi ramkrishna news) ప్రశ్నించారు. మంత్రులు, వైకాపా నేతలు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని జనసేన అధికార ప్రతినిధి పోతిన మహేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం జగన్‌కి కులపిచ్చి లేదని ఎవరైనా కాదనగలరా అని ప్రశ్నించారు.
సోషల్ మీడియాలో రచ్చ రచ్చ...
వైకాపా.. జనసేన మాటల యుద్ధంపై సామాజిక మాధ్యమాల్లోనూ రచ్చ రచ్చ జరుగుతోంది. జనసేన అభిమానులు.. పలు అంశాలను ప్రస్తావిస్తూ.. అధికార వైకాపాపై సెటైర్లు, పంచ్‌లు విసురుతున్నారు. ఇందుకు బదులుగా వైకాపా అభిమానులు కూడా.. ఘాటుగా బదులిస్తున్నారు. పవనే టార్గెట్‌గా పోస్టుల వర్షం కురిపిస్తున్నారు. పలు యాశ్ ట్యాగ్‌లతో... పోస్టుల యుద్ధం చేస్తున్నారు. ఇరు పార్టీలకు మద్దతుగా క్రియేట్ చేసిన గ్రూపులన్నీ... ఈ వివాదానికి సంబంధించిన పోస్టులతోనే నిండిపోయాయి.
ఆన్లైన్లో టిక్కెట్ల అంశంతోనే జనసేన.. వైకాపాల మధ్య ఈ మాటల యుద్ధం మొదలైంది. కానీ ఏ అంశంతో వివాదం మొదలయ్యిందో... ఆ విషయంపై పెద్దగా చర్చ జరగకపోవటం గమనార్హం. సామాజిక, వ్యక్తిగత అంశాలకే అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. విమర్శలు చేసుకుంటున్న తీరుతో టిక్కెట్ వార్ కాస్త.. మరో మలుపు తిరుగుతున్నట్లు కనిపిస్తోంది.
-
ఇదే ఆంధ్రప్రదేశ్ ప్రగతి!
— Pawan Kalyan (@PawanKalyan) September 28, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
హిందూ దేవాలయాలు, హిందూ దేవతామూర్తుల విగ్రహాలపై ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 140 దాడులు, విధ్వంసాలు. వై.సి.పి. పాలనలో ఆంధ్రప్రదేశ్ లో ఈ రెండున్నర ఏళ్లలో జరిగిన ప్రగతి ఇదే! దాడులకు పాల్పడిన దోషులంతా క్షేమం.
ఎక్కడున్నాయి వై.సి.పి. గ్రామ సింహాలు? pic.twitter.com/cbfX4hI7bK
">ఇదే ఆంధ్రప్రదేశ్ ప్రగతి!
— Pawan Kalyan (@PawanKalyan) September 28, 2021
హిందూ దేవాలయాలు, హిందూ దేవతామూర్తుల విగ్రహాలపై ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 140 దాడులు, విధ్వంసాలు. వై.సి.పి. పాలనలో ఆంధ్రప్రదేశ్ లో ఈ రెండున్నర ఏళ్లలో జరిగిన ప్రగతి ఇదే! దాడులకు పాల్పడిన దోషులంతా క్షేమం.
ఎక్కడున్నాయి వై.సి.పి. గ్రామ సింహాలు? pic.twitter.com/cbfX4hI7bKఇదే ఆంధ్రప్రదేశ్ ప్రగతి!
— Pawan Kalyan (@PawanKalyan) September 28, 2021
హిందూ దేవాలయాలు, హిందూ దేవతామూర్తుల విగ్రహాలపై ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 140 దాడులు, విధ్వంసాలు. వై.సి.పి. పాలనలో ఆంధ్రప్రదేశ్ లో ఈ రెండున్నర ఏళ్లలో జరిగిన ప్రగతి ఇదే! దాడులకు పాల్పడిన దోషులంతా క్షేమం.
ఎక్కడున్నాయి వై.సి.పి. గ్రామ సింహాలు? pic.twitter.com/cbfX4hI7bK
ఇదీ చదవండి
YCP Vs Janasena: వైకాపా Vs జనసేన.. సినిమా టిక్కెట్ల వివాదంపై మాటల తుటాలు