గుంటూరు జిల్లా కొత్తగణేశునిపాడు వీఆర్వో గ్రామ సచివాలయం ఎదుట ఆందోళన చేశారు. పంచాయతీ కార్యదర్శి రవికుమార్ ఇబ్బందులకు గురిచేస్తున్నారని ప్లకార్డుపై రాసి విష్ణువర్ధన్ రెడ్డి నిరసన చేపట్టారు. బయోమెట్రిక్ హాజరు వేసే యాప్ పాస్వర్డ్ తరచూ మారుస్తూ.. ఇబ్బంది పెడుతున్నాడని ఆరోపించారు. మండలంలోని 15 సచివాలయాల్లో లేని నిబంధనలు ఇక్కడ అమలు చేస్తున్నారని తెలిపారు.
ఎంపీడీవో రాజగోపాల్, అన్ని రెవెన్యూ గ్రామాల వీఆర్వోలు, పంచాయతీ కార్యదర్శులు కొత్తగణేశునిపాడు వద్దకు వెళ్లి చర్చలు జరిపారు. సమన్వయంతో పని చేయాలని వీఆర్వో, పంచాయతీ కార్యదర్శికి ఎంపీడీవో సూచించారు. గతంలో వారిద్దరి మధ్య వివాదం ఉందని ఆయన అన్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం సచివాలయానికి వచ్చి సిబ్బంది బయోమెట్రిక్ హాజరువేయాలని చెప్పారు.