ఎంతో రసవత్తరంగా సాగిన పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ.. గుంటూరు జిల్లా తెనాలి డివిజన్లో పూర్తయింది. ఈ క్రమంలో కాకుమాను మండలంలోని 12 గ్రామ పంచాయతీల్లో 118 పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ ప్రక్రియ ముగిసింది.
మరో అరగంటలో ఓట్ల లెక్కింపు ప్రక్రియను ప్రారంభిచేందుకు ఎన్నికల అధికారులు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. ఇప్పటికే లెక్కింపు నిమిత్తం బ్యాలెట్ బాక్సులను కేటాయించిన కేంద్రాలకు తరలిస్తున్నారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియకు భారీగా పోలీసు బందోబస్తును అధికారులు ఏర్పాటు చేశారు. ఫలితాల కోసం అభ్యర్థులు, ప్రజలు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.