ఎన్నికల సందర్భంగా గుంటూరు జిల్లా వినుకొండ పట్టణంలో మాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు ఎన్నికలపై జోస్యం చెప్పారు. రాష్ట్ర ప్రజలు జరగబోతున్న స్థానిక సంస్థల ఎన్నికలలో.. వైకాపా అభ్యర్థులను ఓడించి ముఖ్యమంత్రికి గట్టి గుణపాఠం చెప్తారని అన్నారు. క్యాంటీన్లు, ఎస్సీ,ఎస్టీ, బీసీల అభివృద్ధి కోసం వినియోగించవలసిన కార్పొరేషన్ నిధులు పూర్తిగా నిలుపుదల చేయటంపై ప్రజలు మండిపడుతున్నారన్నారు. వైకాపా అధికారంలోకి వచ్చిన నాటి నుంచి 30 రకాల అభివృద్ధి పనులను మూసివేసిందని ఆరోపించారు. రాజధాని విషయంలోనూ మాట మార్చి.. మూడు రాజధానుల పాట పాడుతున్నారని మండిపడ్డారు.
ఇదీ చదవండి: ఎన్నికల రిటర్నింగ్, నోడల్ అధికారులతో విశాఖ కలెక్టర్ సమీక్ష