గుంటూరు జిల్లా వినుకొండ పురపాలక ఎన్నికల్లో తెదేపా ఐదు వార్డుల్లో గెలిస్తే... ఎమ్మెల్యే పదవికి స్వచ్ఛందంగా రాజీనామా చేస్తానని, లేకపోతే మాజీ ఎమ్మెల్యే జీవీ రాజకీయాల నుంచి తప్పుకుంటారా అని ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు సవాల్ విసిరారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా వినుకొండలో తెదేపా, భాజపా, సీపీఐ, జనసేనల పొత్తులు వింత పోకడలకు దారి తీస్తున్నాయని బ్రహ్మనాయుడు అన్నారు. పట్టణంలోని మసీదు మాన్యం భూములను సీపీఐ నేతలు ఆక్రమించుకున్నారని విమర్శించారు. వీరికి తెదేపా నేతలు మద్దతు ఇచ్చారని ఆరోపించారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే ఆ భూముల్లోని అక్రమ కట్టడాలను తొలగించి, అర్హులైన ముస్లిం పేదలకు పంపిణీ చేస్తామని ఎమ్మెల్యే తెలిపారు.
ఇదీచదవండి.