ETV Bharat / state

'ఆ ప్రత్యేకాధికారి మా గ్రామంలో కోటి రూపాయల నిధులు కాజేశాడు' - gottipadu village sarpanch updates

గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండలం గొట్టిపాడు పంచాయతీ నిధులను ప్రత్యేకాధికారి కాజేశారని సర్పంచి ఆరోపించారు. ఆర్టీఐ ద్వారా వివరాలు సేకరించామని ..వాటిని మళ్లీ పంచాయతీలో జమ చేసేలా చేయాలని ఆమె ప్రభుత్వాన్ని కోరారు. అతనిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

gottipadu village fund
గొట్టిపాడు పంచాయతీ నిధుల ఫ్రాడ్
author img

By

Published : Jul 9, 2021, 12:56 PM IST

గొట్టిపాడు పంచాయతీ నిధుల ఫ్రాడ్

గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండలం గొట్టిపాడు పంచాయతీలో ప్రత్యేకాధికారి పాలనలో కోటి రూపాయలు నిధులు గోల్ మాల్ జరిగిందని సర్పంచి పత్తిపాటి మరియరాణి ఆరోపించారు. తాను సర్పంచిగా ఎన్నికైన తరువాత పంచాయతీ రికార్డులు కావాలని అధికారులను అడిగితే ఇవ్వలేదని చెప్పారు. ప్రత్యేకాధికారిగా ఉన్న ఈవోపీఆర్డీ గిరిధరరావు నిధులు స్వాహా చేశారన్నారు. పాత రికార్డులతో నీకు సంబంధం ఏమిటి ఇవ్వం అని చెప్పారన్నారు. అందువల్ల ఉప సర్పంచి భర్త శ్రీకాంత్... నిధులు, ఖర్చుల వివరాలు కావాలని సమాచార హక్కు చట్టంకు దరఖాస్తు చేయగా నిధులు మింగేసిన విషయం వెలుగులోకి వచ్చిందన్నారు. కనీసం బిల్లులు లేకుండా నిధులు తీసుకున్నారని చెప్పారు. ఎం బుక్ చేయకుండానే బిల్లులు చేసుకుని జేబులు నింపుకున్నారని ధ్వజమెత్తారు.

చెరువుకు నీరు పెట్టేందుకు రూ. 4 లక్షల 32 వేలు నిధులు స్వాహా చేసినట్లు చెప్పారు. గత మూడేళ్లలో ఇష్టానుసారం బిల్లులు పెట్టుకుని నిధులు ఖాళీ చేసారన్నారు. ఈవోపీఆర్డీని గిరిధరరావును వివరణ అడిగితే ఆ విషయం మరిచిపోవాలని... లేకపోతే సర్పంచి పదవి నుంచి తొలగింపజేస్తామని బెదిరించారని ఆమె వాపోయారు. హోంమంత్రి సుచరిత, కలెక్టర్ విచారణకు ఆదేశించాలని, అక్రమంగా తీసుకున్న నిధులు తిరిగి పంచాయతీకి జమ చేయాలని కోరారు. ఆ నిధులు దుర్వినియోగం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ఇదీ చూడండి.

కారుమూరి నాగేశ్వర‌రావుకు "అన్నదాత‌లంటే అంత అలుసా : లోకేశ్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.