Gothikoyas Village boycott in Bendalapadu: విధి నిర్వాహణలో తన ప్రాణాలను ఎదురొడ్డి నిలిచిన ఎఫ్‌ఆర్వో శ్రీనివాసరావు హత్యను ఖండిస్తూ బెండలపాడు పంచాయతీ తీర్మానించింది. అటవీ అధికారిని హత్య చేయడాన్ని ఖండించిన పంచాయతీ పాలకవర్గం.. గ్రామం నుంచి గొత్తికోయలను బహిష్కరించాలని నిర్ణయించింది. నిందితులు నివసించే ఎర్రబోడు నుంచి ఛత్తీస్‌గఢ్‌కు వారిని తరలించాలని గ్రామసభ నిర్ణయం తీసుకుంది.
అసలేం జరిగింది: చంద్రుగొండ మండలం బెండాలపాడు అటవీ ప్రాంతం ఎర్రబోడు సమీపంలో అటవీశాఖ అధికారులు నాటిన మొక్కలు తొలగించేందుకు 22వ తేదీ ఉదయం పోడుభూముల సాగుదారులు యత్నించారు. వారిని అడ్డుకోవడానికి వెళ్లిన అధికారులు శ్రీనివాసరావు, రామారావుపై మూకుమ్మడిగా దాడికి యత్నించడంతో బెండాలపాడు అటవీశాఖ సెక్షన్ అధికారి రామారావు అక్కడి నుంచి తప్పించుకున్నారు. మొక్కలు తొలగించవద్దని చెప్పే లోపే అక్కడే ఉన్న శ్రీనివాసరావుపై గొత్తికోయలు కత్తులు, గొడ్డళ్లతో ఒక్కసారిగా విరుచుకుపడ్డారు.
ఈ దాడిలో శ్రీనివాసరావు తీవ్రంగా గాయపడ్డారు. మెడ భాగంలో బలమైన గాయాలై తీవ్ర రక్తస్రావం కావటంతో వెంటనే ఆయన్ను చంద్రుగొండు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించి చికిత్స అందించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో అక్కడనుంచి అంబులెన్స్‌లో ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యంలో తుదిశ్వాస విడిచారు.
ఇవీ చదవండి: