గుంటూరు జిల్లా మంగళగిరిలో నిర్మించిన ఎన్టీఆర్ పట్టణ గృహ పథకంలో జరిగిన అక్రమాలపై విజిలెన్స్ విచారణ చేపట్టాలని ప్రభుత్వాన్ని కోరుతామని స్థానిక శాసనసభ్యులు ఆళ్ల రామకృష్ణారెడ్డి తెలిపారు. ఇళ్లు మంజూరైన లబ్దిదారులతో ఆయన సమావేశమయ్యారు. 1728 లబ్ధిదారులకు గాను 2053 మందితో అప్పటి పురపాలక సంఘం ఛైర్మన్ డీడీలు కట్టించారని చెప్పారు. తెదేపా నాయకులు లబ్ధిదారుల వద్ద డబ్బులు తీసుకొని ఇళ్లు కేటాయించారని విమర్శించారు. అలాంటి వారిపై ఎవరైనా ఫిర్యాదు చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
ఇదీ చదవండి... 'కోర్టు అనుమతితో సీఎం విదేశాలకు వెళ్లటం రాష్ట్రానికి అప్రతిష్ట'