ETV Bharat / state

పనికి రాని చెరువు నీళ్లు.. వేరే దారిలేక

Vejendla Water Wells: చేదబావులు. చాలామంది ఈ పేరు వినే ఉంటారు. కొందరు చూసే ఉంటారు. కానీ ఇప్పటికి చేదబావులపై ఆధారపడి ఉన్న గ్రామం ఉందంటే ఆశ్ఛర్యం కలుగక మానద. గుంటూరు జిల్లాలోని వేజెండ్ల గ్రామంలో ప్రజల నీటి అవసరాలు తీర్చటంలో ఇప్పటికీ చేదబావులే కీలకంగా ఉన్నాయి. పంచాయతీ నీళ్లు స్నానాలకు కూడా పనికిరాని పరిస్థితుల్లో పురాతన చేదబావులే గ్రామస్థుల నీటి అవసరాలు తీరుస్తున్నాయి.

వేజెండ్లలో నీటి బావులు
వేజెండ్లలో నీటి బావులు
author img

By

Published : Nov 21, 2022, 4:47 PM IST

వేజెండ్లలో నీటి బావులు

Vejendla Water Wells: ఆ ఊరికి బావులే ఆధారం. చెరువు నుంచి ఇళ్లకు కుళాయిల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నా.. ఆ నీరు తాగేందుకు పనికిరాదు. వాసనతో పాటు మురికిగా ఉండటంతో.... వేరే దారి లేక పురాతన బావులకే మోటర్లు బిగించి.. ఇళ్లకు నీటిని తీసుకెళ్తున్నారు. ఆ నీటినే తాగడంతో పాటు వంటలకు వాడుతున్నారు. ఇలా ఏళ్లుగా బావులే ఆ గ్రామ నీటి అవసరాలకు దిక్కయ్యాయి.

చేదబావి చుట్టూ పైపులు, బావిలో మోటార్లు.. ఈ దృశ్యాలు గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం వేజెండ్ల గ్రామంలోనివి. ఎప్పుడో కాలగర్భంలో కలిసిపోయాయనుకున్న చేదబావులు ఇక్కడ ఇంకా వినియోగంలో ఉండటం ఆశ్ఛర్యమే. అంతేకాదు ఇక్కడి ప్రజల నీటి అవసరాలు తీర్చేందుకు బావినీళ్లే దిక్కయ్యాయి. ఎందుకంటే పంచాయతీ ద్వారా సరఫరా చేసే నీరు ఏ మాత్రం వినియోగానికి ఉపయోగపడకపోవటంతో పురాతన కాలం నాటి నీటి వనరులపైనే గ్రామస్థులు ఆధారపడ్డారు. గ్రామంలోని చెరువు నుంచి పైపు లైన్లు వేసి అన్ని వీధులకు కుళాయిలు ఏర్పాటు చేశారు. అయితే అవి అలంకార ప్రాయమే. నీటిని సరిగా శుద్ధి చేయకుండా పంపింగ్ చేస్తుండటంతో ఆ నీరు పనికిరాదు. కేవలం పశువులు కడుక్కోవటానికి, మరుగుదొడ్లకు మాత్రమే ఉపయోగిస్తున్నారు. స్నానాలకు సైతం చేదబావిల్లోని నీరే ఆధారమైంది. పంచాయతీ సరఫరా చేసే నీటితో స్నానాలు చేస్తే ఒంటిపై దద్దుర్లు వస్తున్నాయని, దురద పెడుతోందని గ్రామస్థులు తెలిపారు. చేదబావిలు సరిగా నిర్వహణ లేకపోవటంతో కొన్ని పాడైపోయాయి. వాటిని మరమ్మతులు కూడా చేయటం లేదు. కనీసం బావుల్లో బ్లీచింగ్ వేయమని కోరినా అధికారులు స్పందించటం లేదని గ్రామస్థులు అంటున్నారు. అందుకే తాగునీటిని క్యాన్ల ద్వారా కొనుగోలు చేస్తున్నట్లు చెబుతున్నారు.

గతంలో నీళ్లు చేదుకుని కడవలు, బిందెల్లో ఇళ్లకు తెచ్చుకునేవారు. ఇప్పుడు మాత్రం మోటార్లు పెట్టి నేరుగా ఇళ్లకు పైపులు వేసుకున్నారు. గ్రామంలో రెండు, మూడు వీధులకు ఓ బావి ఉంటుంది. అక్కడి ప్రజలందరూ బావిలో మోటార్లు వేసుకుని నీళ్లు తోడుకుంటుంటారు. సొంత మోటార్లు పెట్టుకునేవారు కొందరైతే... ఖర్చు భరించలేని వారు మాత్రం మరికొందరితో కలిసి మోటర్ తెచ్చి ఏర్పాటు చేసుకున్నారు. కరెంటు ఉన్నప్పుడు మాత్రమే నీళ్లు. విద్యుత్ కోతలు పెరిగితే బావుల్లోని నీరు కూడా తోడుకోలేరు. గ్రామంలో నీటి సమస్య గురించి ప్రజాప్రతినిధులకు తెలిసినా పట్టించుకోవటం లేదని వాపోతున్నారు.

ప్రజలకు స్వచ్ఛమైన నీరు ఇవ్వకపోయినా.. పన్నుల వసూళ్లలో మాత్రం ఎలాంటి మినహాయింపులు లేవు. నీటి కోసం అదనంగా వేల రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తోందని గ్రామస్థులు చెబుతున్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.