ETV Bharat / state

'రాష్ట్రంలో ఎన్నికల కమిషనర్​కే భద్రత లేదాయే?' - సీఎస్​పై వర్ల రామయ్య కామెంట్స్

ఏపీలో తనకు భద్రత లేదని హైదరాబాద్ నుంచి విధులు నిర్వర్తిస్తానని ఎస్​ఈసీ అంటున్నారంటే... వైకాపా పాలన ఏ స్థాయిలో ఉందో అర్థమవుతుందని తెదేపా నేత వర్ల రామయ్య విమర్శించారు. రాష్ట్రం నుంచి విధులు నిర్వర్తించేలా ఎన్నికల కమిషనర్​కు ధైర్యం కలిగించే బాధ్యత సీఎస్, డీజీపీలపై ఉందన్నారు.

Varla ramaiah
వర్ల రామయ్య
author img

By

Published : Mar 20, 2020, 11:01 PM IST

వర్ల రామయ్య మీడియా సమావేశం

ఎన్నికల కమిషనర్‌ హైదరాబాద్‌ నుంచి విధులు నిర్వర్తిస్తుండటం రాష్ట్ర ప్రభుత్వానికి చెంపదెబ్బ అని... తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య విమర్శించారు. రాష్ట్రం నుంచి విధులు నిర్వర్తించేలా రమేష్​కుమార్​లో ధైర్యం నింపాల్సిన బాధ్యత డీజీపీ, సీఎస్​లదేనని స్పష్టం చేశారు. మంగళగిరి తెదేపా కేంద్ర కార్యాలయంలో మాట్లాడిన ఆయన... ఎన్నికలు వాయిదా వేయగానే రమేష్​కుమార్​పై సీఎం సహా వైకాపా నేతలంతా దాడి చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

రాజ్యాంగ వ్యవస్థపై నోటికొచ్చినట్లు మాట్లాడిన స్పీకర్ తమ్మినేని సీతారాంను ఎందుకు అరెస్టు చేయలేదని వర్ల ప్రశ్నించారు. బాధ్యత గల పదవుల్లో ఉన్నవారు ఎన్నికల కమిషనర్​ను కించపరిచేలా మాట్లాడితే డీజీపీ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని నిలదీశారు. తనకు రక్షణ కావాలని రమేష్​కుమార్ లేఖ రాస్తే మీడియా కుట్ర అని వైకాపా ఎమ్మెల్యేలు నోటికొచ్చినట్లు మాట్లాడారని ఆరోపించారు. వైకాపా ఎమ్మెల్యేలు ఇచ్చిన ఫిర్యాదును డీజీపీ ఎలా తీసుకుంటారని... లేఖ ఆధారంగా ఇప్పటికే కేంద్ర బలగాలు వచ్చాయని వారికి చెప్పే బాధ్యత డీజీపీకి లేదా అని ప్రశ్నించారు.

ఇదీ చదవండి : 'హైకోర్టు తాజా నిర్ణయం వైకాపా ప్రభుత్వానికి చెంపపెట్టు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.