మండలి రద్దు బిల్లు సెలక్ట్ కమిటీకి వెళితే.. అధికారపక్ష నేతలకు భయమెందుకని మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు నిలదీశారు. మండలిని రద్దు చేసే అధికారం ప్రభుత్వానికి లేదన్నారు. వైకాపా నేతలు బిజినెస్ రూల్స్‌ను తుంగలోకి తొక్కేలా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. విశాఖ రైతులు ప్రభుత్వానికి తమ భూములు ఇవ్వడానికి సిద్దంగా లేరని తెదేపా నేత పంచుమర్తి అనురాధ తెలిపారు. తాను విశాఖలో పర్యటించినప్పుడు రైతుల అభిప్రాయాలు తీసుకున్నామన్నారు. ఏ ఒక్క రైతు తమ భూములు ఇవ్వడానికి ఒప్పుకోలేదని చెప్పారు.
ఇదీ చూడండి: