యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన 2019 ఫలితాల్లో 76వ ర్యాంక్ సాధించిన సూర్యతేజ.. హోంమంత్రి మేకతోటి సుచరితను కలిశారు. బ్రాడిపేట్లోని హోంమంత్రి నివాసంలో తన తల్లి, సోదరుడితో కలిసి సూర్యతేజ హోంమంత్రిని మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందించారు. సివిల్స్ లో విజయం సాధించిన సూర్యతేజకు సుచరిత శుభాకాంక్షలు తెలిపారు. గుంటూరుకు చెందిన సూర్య తేజ పట్టుదలతో సివిల్స్ లో విజయం సాధించారు. సివిల్స్ పరీక్షల్లో రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన 34 మంది అభ్యర్థులు సత్తా చాటారు. ఈ విజయాన్ని తన తండ్రికి అంకితం చేస్తున్నట్లు సూర్యతేజ పేర్కొన్నారు.
ఇదీ చదవండి: భాజపా ఎంపీ అశోక్ గస్తి కన్నుమూత