ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను కేంద్ర పెట్రోలియం శాఖ కార్యదర్శి తరుణ్ కపూర్, ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ లిమిటెడ్..ఓఎన్‌జీసీ ఛైర్మన్ సుభాష్ కుమార్ కలిశారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎంతో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. కాకినాడ పెట్రో కెమికల్ కాంప్లెక్స్‌పై సీఎంతో కేంద్ర పెట్రోలియం సెక్రటరీ తరుణ్ కపూర్, ఓఎన్‌జీసీ ఛైర్మన్ సుభాష్ కుమార్ చర్చించినట్లు ముఖ్యమంత్రి కార్యాలయం తెలిపింది.
ఇదీ చదవండి: Gajanan Mallya: చిత్తాపూర్-రాయచూర్ సెక్షన్‌లో గజానన్ మాల్య తనిఖీలు