గుంటూరు జిల్లా కొల్లిపర మండలం పిడవర్తిపాలెంలో విషాదం నెలకొంది. రేపల్లె డ్రెయిన్‌లో పడి ఇద్దరు యువకులు గల్లంతయ్యారు. గ్రామానికి చెందిన యామినేని సాయి సునీల్, యామినేని చామంత్.. గేదెలను కడిగేందుకు డ్రెయిన్‌కు వెళ్లారు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు సాయి సునీల్ నీటిలో మునిగిపోయాడు. సునీల్‌ను రక్షించే క్రమంలో చామంత్ కూడా కాల్వలో కొట్టుకుపోయారు. సమాచారం తెలుసుకున్న స్థానికులు, పోలీసులు ఇద్దరి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
ఇదీ చదవండి: