ETV Bharat / state

పండగ వేళ విషాదం రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి - గుంటూరులో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి

Road Accident: రెండు ద్విచక్ర వాహనాలు పరస్పరం ఢీకొని ఇద్దరు వ్యక్తులు మృతి చెందిన సంఘటన గుంటూరు జిల్లా పిరంగీపురం మండలంలో ఆదివారం జరిగింది. పోలీసులు తెలిపిన సమాచారం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి.

Accident
రోడ్డు ప్రమాదం
author img

By

Published : Jan 15, 2023, 11:01 PM IST

Road Accident: గుంటూరు జిల్లాలో పండుగ పూట విషాదం జరిగింది. రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు చనిపోయారు. పోలీసుల వివరాల ప్రకారం.. పల్నాడు జిల్లా నాదెండ్ల మండలం, సాతులూరు గ్రామానికి చెందిన గ్రంధి సుబ్రహ్మణ్యం (38) సంక్రాంతి పండుగ పురస్కరించుకొని గుంటూరులోని అత్తగారింటికి వెళుతున్నాడు. అయితే మార్గమధ్యలో వేములూరుపాడు ఎన్ఎస్పీ కాల్వ సమీపంలో ఎదురుగా గుంటూరు వైపు నుంచి రొంపిచర్ల మండలం, కొనకంచి వారి పాలెం గ్రామానికి చెందిన మాచర్ల కోటేశ్వరరావు,(27) తన బైక్ పై అతివేగంగా అజాగ్రత్తగా రాంగ్ రూట్లోకి వచ్చి గ్రంధి సుబ్రహ్మణ్యం బైకును ఢీకొనగా ఇరువురికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో మాచర్ల కోటేశ్వరరావు అనే వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందాడు.

గ్రంధి సుబ్రహ్మణ్యంను చికిత్స నిమిత్తం గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి 108 ఆంబులెన్స్ లో తీసుకెళ్ళగా డాక్టర్ పరీక్షించి మార్గమధ్యంలోనే చనిపోయినట్లు నిర్ధారించారని పోలీసులు తెలిపారు. దీనిపై గ్రంధి సుబ్రహ్మణ్యం తండ్రి సాంబశివరావు ఇచ్చిన రిపోర్టుపై ఫిరంగిపురం ఎస్.ఐ. ఎం. లక్ష్మీనారాయణ రెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు చేయుచున్నారు. మృతదేహాలు రెండు జి.జి.హెచ్. గుంటూరులో ఉన్నవని రేపు ఉదయం శవ పరీక్ష నిర్వహిస్తామని ఎస్సై తెలిపారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.