నరసరావుపేటలో తాజాగా మరో రెండు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గుంటూరు జిల్లా ఆరోగ్య శాఖ అధికారులు విడుదల చేసిన నివేదికలో జిల్లాలో కొత్తగా 13 పాజిటివ్ కేసులు నిర్థరణ కాగా వాటిలో 2 కేసులు నరసరావుపేటలో నమోదయ్యాయి. ఫలితంగా తాజా కేసులతో కలిపి పట్టణంలో పాజిటివ్ కేసుల సంఖ్య 192కి చేరింది. నమోదైన 2 కేసులు శ్రీనివాసనగర్ కు చెందినవని అధికారులు తెలిపారు. ప్రస్తుతం శ్రీనివాసనగర్లో కరోనా కేసులు పెరుగుతుండటంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. పట్టణంలో కరోనా విజృంభిస్తున్న తరుణంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచించారు.
నరసరావుపేటలో మరో రెండు పాజిటివ్ కేసులు - narasaraopeta corona virus news
గుంటూరు జిల్లా నరసరావుపేటలో మరో రెండు పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తాజా కేసులతో కలిపి పట్టణంలో పాజిటివ్ కేసుల సంఖ్య 192కి చేరింది.
![నరసరావుపేటలో మరో రెండు పాజిటివ్ కేసులు నరసరావుపేటలో మరో రెండు పాజిటివ్ కేసులు](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7380593-466-7380593-1590665202849.jpg?imwidth=3840)
నరసరావుపేటలో తాజాగా మరో రెండు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గుంటూరు జిల్లా ఆరోగ్య శాఖ అధికారులు విడుదల చేసిన నివేదికలో జిల్లాలో కొత్తగా 13 పాజిటివ్ కేసులు నిర్థరణ కాగా వాటిలో 2 కేసులు నరసరావుపేటలో నమోదయ్యాయి. ఫలితంగా తాజా కేసులతో కలిపి పట్టణంలో పాజిటివ్ కేసుల సంఖ్య 192కి చేరింది. నమోదైన 2 కేసులు శ్రీనివాసనగర్ కు చెందినవని అధికారులు తెలిపారు. ప్రస్తుతం శ్రీనివాసనగర్లో కరోనా కేసులు పెరుగుతుండటంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. పట్టణంలో కరోనా విజృంభిస్తున్న తరుణంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచించారు.
ఇదీ చూడండి: కేజీహెచ్‌లో కరోనా కలకలం... మూతపడ్డ ఓ వార్డు