గుంటూరు జిల్లా దాచేపల్లి గురజాల మాజీ ఎమ్మెల్యే, దివంగత కొత్త వెంకటేశ్వర్లు కుటుంబాన్ని కరోనా వైరస్ కాటేసింది. కొవిడ్ మహమ్మారి రోజుల వ్యవధిలో ఆయన ఇద్దరు మనవళ్లను పొట్టన బెట్టుకుంది. దాచేపల్లి మండలం ముత్యాలంపాడు గ్రామానికి చెందిన కొత్త కోటేశ్వరరావు, లక్ష్మీకుమారికి ముగ్గురు సంతానం.
వారి కుమార్తె, అల్లుడు దక్షిణాఫ్రికాలో ఉంటున్నారు. మిగిలిన ఇద్దరు కుమారులు కరోనాతో మృతి చెందారు. పెద్ద కుమారుడు నరేష్ కుమార్ (35) గత నెల 21న పిడుగురాళ్లలో మరణించగా.. చిన్న కుమారుడు రామకృష్ణ (34) హైదరాబాద్ కిమ్స్ లో చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందాడు.
కాంగ్రెస్ పార్టీకి నేతయిన కొత్త వెంకటేశ్వర్లు 1960 నుంచి 1970 ప్రాంతంలో రెండుసార్లు గురజాల ఎమ్మెల్యేగా చేశారు. ఆయన మనుమడు రామకృష్ణ మృతి పార్టీకి తీరని లోటని గురజాల ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
ఇవీ చదవండి: