గుంటూరు జిల్లా వెల్దుర్తి మండలం కొత్తపుల్లారెడ్డిపురంలో విషాదం చోటు చేసుకుంది. నీటిగుంటలో గ్రామ శివారులోని నీటి కుంట వద్దకు ఆడుకునేందుకు వెళ్లిన ఇద్దరు చిన్నారులు.. ప్రమాదవశాత్తు జారి కుంటలోని నీటిలో పడి మృతి చెందారు. ఇద్దరు చిన్నారులను గ్రామానికి చెందిన పిల్లి కొండలు(10), పిన్ని బోయిన సైదులుగా గుర్తించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి: