అమరావతి ఉద్యమంలో మరో రెండు గుండెలు ఆగిపోయాయి. రాయపూడిలో రైతు కూలీ మస్తాన్ గుండెపోటుతో మృతి చెందాడు. మస్తాన్ అమరావతికి మద్దతుగా దీక్షల్లో పాల్గొనేవాడు. రాజధానిని తరలిస్తున్నారన్న మనస్తాపంతోనే ఆయన చనిపోయాడని బంధువులు చెబుతున్నారు. మస్తాన్ మృతదేహానికి దీక్షా శిబిరంలో రైతులు నివాళులు అర్పించారు.
వెలగపూడిలో రైతు కూలీ సలివేంద్ర సంషోను గుండెపోటుతో మరణించాడు. సంషోను కొన్నాళ్లుగా అమరావతికి మద్దతుగా ఆందోళనలో పాల్గొంటున్నాడు.
ఇదీ చదవండి: వెలగపూడి.. 74వ రోజూ తగ్గని రాజధాని పరిరక్షణ పోరాట వేడి