గుంటూరు జిల్లాలో ఓ ప్రేమ పెళ్లి వ్యవహారం రెండు కుటుంబాల మధ్య ఘర్షణకు దారి తీసింది. సత్తెనపల్లి మండలం కట్టావారి పాలెంకు చెందిన యువతి, యువకుడు ప్రేమించుకున్నారు. సామాజిక వర్గాలు వేరు కావటంతో పెళ్లికి పెద్దలు అంగీకరించలేదు. ఈ క్రమంలో వారు పారిపోయి పెళ్లి చేసుకున్నారు. కొద్ది రోజుల క్రితం ఇంటికి వచ్చారు. పట్టింపులకు పోయిన ఇరు కుటుంబాల వారు కర్రలతో పరస్పరం దాడి చేసుకున్నారు. ఇందులో 11 మందికి గాయాలయ్యాయి. వీరిని సత్తెనపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
ఇదీ చదవండి: రాష్ట్రంలో 58కి చేరిన కరోనా కేసులు