గుంటూరు జిల్లాలో కరోనా కేసులు తగ్గినట్లే తగ్గి.. మళ్లీ వాటి ఉనికిని చాటుకుంటున్నాయి. 72 రోజులుగా ప్రశాంతంగా ఉన్న పల్లెల్లో తాజాగా కరోనా కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. ప్రత్తిపాడు నియోజకవర్గంలోని 4 మండలాల్లో ఇప్పటివరకు కరోనా కేసులు నమోదు కాలేదు. తొలిసారిగా 2 కరోనా పాజిటివ్ కేసులు రావడం ప్రజలను భయాందోళనకు గురి చేస్తోంది. ప్రత్తిపాడులోని రామ్ నగర్ కాలనీకి చెందిన 52 ఏళ్ల వ్యక్తికి కరోనా సోకింది. ఇతను గుంటూరులోని కూరగాయల మార్కెట్లో ముఠా కూలీ.
ఇటీవల మార్కెట్లో ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్ నిర్ధారణ కాగా.. అధికారులు అక్కడ పనిచేసే 190 మందికి వైద్య పరీక్షలు నిర్వహించారు. అందులో ప్రత్తిపాడుకు చెందిన వ్యక్తికి కరోనా పాజిటివ్‌గా తేలింది. వట్టిచెరుకూరు మండలం పల్లపాడులో మరొకరికి కరోనా సోకినట్లు అధికారులు నిర్ధరించారు. వీరితో సంబంధం ఉన్న వారిని అంబులెన్స్‌లో ఐసోలేషన్‌కు తరలించారు. సౌత్ జోన్ డీఎస్పీ కమలకరరావు కాలనీలోని పరిస్థితిని పరిశీలించారు. ఈ ప్రాంతాలకు రాకపోకలు నిలుపుదల చేయాలని ఆదేశించారు.
ఇవీ చూడండి: