ఈత సరదా ఇద్దరు చిన్నారుల ప్రాణాలు తీసిన ఘటన.. గుంటూరు జిల్లా మంగళగిరిలో జరిగింది. పట్టణంలోని రత్నాల చెరువు ప్రాంతానికి చెందిన షేక్ మన్సూర్, షేక్ మస్తాన్ లు.. ఆదివారం కావడంతో సమీపంలోని ఆత్మకూరు కాలువలో ఈతకు వెళ్లారు. కాలువలో దిగిన కాసేపటికే ఇద్దరు పిల్లలు గల్లంతయ్యారు. వీరిని గమనించిన స్థానికులు.. పోలీసులకు సమాచారమిచ్చారు. పోలీసులు, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది కలిసి సుమారు మూడు గంటలపాటు కాలువలో గల్లంతైన వారి కోసం వెదికారు. అనంతరం వారి మృతదేహాలను వెలికితీశారు. అప్పటివరకు ఆడుతూ పాడుతూ ఉన్న చిన్నారులు.. విగతజీవులుగా పడివుండటాన్ని చూసిన కుటుంబసభ్యుల రోదనలను మిన్నంటాయి. పోస్టుమార్టం నిమిత్తం..పిల్లల మృతదేహాలను జిల్లాలోని ఎన్ఆర్ఐ ఆస్పత్రికి తరలించారు.
ఇదీ చదవండి: