ETV Bharat / state

పసుపు రైతు కంట కన్నీరు! - గుంటూరులో పసుపు రైతుల కష్టాలు

కరోనా ప్రభావం పసుపు రైతుపైనా పడింది. పంటను విక్రయించలేని పరిస్థితి ఎదురైంది. ప్రత్యేక కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినా పసుపు రాశి కదలకుంది. నిబంధనలతో దిగుబడిని పూర్తిస్థాయిలో అమ్ముకోలేని దుస్థితి నెలకొంది. కష్ట కాలంలోనూ కరుణించే నాథుడు లేక రైతులు దిక్కులు చూడాల్సి వస్తోంది. చివరికి రైతులు కన్నీరే మిగులుతోంది.

turmeric problems in guntur
turmeric problems in guntur
author img

By

Published : May 11, 2020, 6:30 PM IST

turmeric problems in guntur
గుంటూరులో పసుపు రైతుల కష్టాలు

లాక్‌డౌన్‌తో రవాణా ఆగింది. పంట ఉత్పత్తుల ఎగుమతి, దిగుమతులు నిలిచిపోయాయి. ఫలితంగా జిల్లాలో పసుపు రైతుకు కొత్త సమస్య తలెత్తింది. కష్టకాలంలో ఉన్న అన్నదాతను ఆదుకునేందుకు ప్రభుత్వం ప్రత్యేక కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసింది. క్వింటా రూ.6,850 చొప్పున గిట్టుబాటు ధర ప్రకటించింది.

కానీ... పసుపు కొనుగోళ్లకు అధికారులు ఆంక్షలు పెట్టడంతో పరిస్థితి మొదటికొచ్చింది. కేవలం ఈ కర్షక్‌లో నమోదైన రైతుల పంటను మాత్రమే కొనుగోలు చేస్తున్నట్లు చెబుతున్నారు. తొలుత ఒక్కో రైతు నుంచి 30 క్వింటాళ్లలోపే కొనుగోలు చేస్తామని ప్రకటించారు. తాజాగా 40 క్వింటాళ్లు కొనుగోలు చేసేలా నిర్ణయించారు.

అలాగే కొనుగోలుకు సంబంధించి టోకన్ల జారీలో నిర్లక్ష్యం నెలకొందని... చెల్లింపుల విషయంలోనూ జాప్యం జరుగుతోందని రైతులు ఆవేదన చెందుతున్నారు.

కరోనా లేకుంటే..

పసుపు సాగుకు కడప జిల్లా పేరొందింది. 33 మండలాల్లో పంటను సాగు చేస్తున్నారు. కాలం కలిసొచ్చి ఉంటే.. దిగుబడిని మహారాష్ట్రకు తరలించి లాభపడేవారు. సౌత్‌జోన్‌ స్థాయిలో పసుపు క్రయవిక్రయాలు ఎక్కువగా జరిగే ఐదు ప్రాంతాల్లోనూ కరోనా విస్తరించి రెడ్‌జోన్లుగా మారాయి.

ఈ కారణంగా.. పంటను ఎక్కడికీ తరలించే వీలులేకుండా పోయింది. ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసినా దిక్కులు చూడాల్సి వస్తోంది. యార్డులో బస్తా దించినందుకు హమాలీకి రూ.30, సంచికి రూ.40 రైతులే చెల్లించాల్సి వస్తోంది. ఎలాంటి ఆంక్షల్లేకుండా పసుపు కొనేలా ప్రభుత్వం చొరవ తీసుకోవాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు.

ఈ కర్షక్‌లో నమోదైతేనే..

ఈ కర్షక్‌లో నమోదైన పంటను మాత్రమే కొనేలా నిబంధనలు పెట్టారు. నగదు చెల్లింపుల విషయం మార్క్‌ఫెడ్‌ ఆధ్వర్యంలో జరుగుతోంది. టోకన్లు, పంటల నమోదులో సమస్యలుంటే స్థానిక సచివాలయాల్లో సంప్రదించాలి. జూన్‌ 15 వరకు కొనుగోళ్లు జరుగుతాయి. సరకు అమ్మిన 20 రోజుల్లో రైతులకు డబ్బు అందుతుంది.

- తేజస్విని, ఉద్యాన శాఖాధికారిణి , - నాగరాజు, మార్క్‌ఫెడ్‌ డీఎం

ఎనిమిది బస్తాలే కొన్నారు

"రెండెకరాల్లో పసుపు సాగు చేయగా 40 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. మైదుకూరు మార్కెట్‌ యార్డులో పసుపు కొనుగోళ్లు ప్రారంభించగా విక్రయించేందుకు టోకన్‌ ఇచ్చారు. ఆశతో సరకంతా తీసుకెళ్లగా.. నా పొలం ఆన్‌లైన్‌లో 22 సెంట్లు మాత్రమే చూపుతోందని, 8 బస్తాలే కొనుగోలు చేశారు. 32 బస్తాలు వెనక్కు పంపించారు." - పెద్దసుబ్బారెడ్డి, సీతారామాపురం, చాపాడు మండలం

టోకెన్‌ ఇవ్వలేదు

"మూడెకరాల్లో పసుపు వేశా. ఎకరాకు 20 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. ఏటా మా ఊరంతా మంచి ధర కోసం పసుపును మహారాష్ట్రలోని షాంగ్లీకి తరలిస్తారు. ఈసారి కొనుగోలు కేంద్రం దగ్గరలోకి వచ్చిందని ఆనందించిన రైతులకు నిరాశే మిగిలింది. టోకెన్‌ కోసం గ్రామ సచివాలయానికి వెళ్లి సంప్రదించినా అదిగో ఇదిగో అంటున్నారు." - వెంకటసుబ్బయ్య, సీతారామాపురం

ఇదీ చదవండి:

కరోనా మృతుల పక్కనే సాధారణ రోగులకు చికిత్స!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.