ఉదయం 4 గంటలకు సైకిల్ రైడ్ మెుదలు పెట్టి.. రాత్రి 9 గంటలకు వరకూ.. ప్రయాణించడం.. దొరికిందేదో తినడం.. నాలుగు గంటలు మాత్రం నిద్రపోవడం. పేద పిల్లల చదువుకు సాయం చేయాలని ట్రైడర్స్ సంస్థ సభ్యులు హైదరాబాద్ టూ రామేశ్వరానికి తలపెట్టిన సైకిల్ యాత్ర పూర్తయింది. 16 మంది సభ్యులు పెట్టుకున్న రూ.12 లక్షల నిధుల సమీకరణ లక్ష్యం నెరవేరింది. 700 మంది దాతలు ఆన్లైన్ ద్వారా విశాఖ గ్లోబల్ ఎయిడెడ్ సంస్థకు విరాళాలు అందించారు.
రామేశ్వరానికి చేరుకున్న ట్రైడర్స్ సంస్థ సభ్యులు 'కలాం' కుటుంబ సభ్యులను కలిశారు. తమ సైకిల్ యాత్ర వెనుక ఉద్దేశాన్ని వివరించారు. ట్రైడర్స్ సభ్యుల సేవను కలాం కుటుంబ సభ్యులు అభినందించారు.
అబ్దుల్ కలాం కుటుంబ సభ్యుల నుంచి ప్రశంసలు అందుకోవడం ఆనందంగా ఉంది. కలాం పెద్దన్న వాళ్ల మనవడు మమ్మల్ని వాళ్ల ఇంటికి తీసుకెళ్లారు. కలాం పుట్టిన ఇంటికి వెళ్లడం.. ఆయన చదువుకున్న నెలపై తిరగడం చాలా సంతోషం. భవిష్యత్లో ఇలాంటి కార్యక్రమాలు ఇంకా చేస్తాం.
- గోపి, ట్రైడర్స్ సభ్యుడు
ఇదీ చదవండి: