- అర్హత కలిగిన ఏ ఒక్క లబ్ధిదారుడు నష్టపోకూడదు.. ప్రతిఒక్కరికి సంక్షేమ ఫలాలు అందాలి:సీఎం
JAGAN RELEASED WELFARE FUNDS : గతంలో ఏ పథకం కావాలన్నా లంచం ఇవ్వాల్సిన పరిస్థితి ఉందని.. కానీ ఇప్పుడు లబ్ధిదారుల ఖాతాల్లో నేరుగా నగదు జమ చేస్తున్నామని సీఎం జగన్ తెలిపారు. సంక్షేమ పథకాలు అందని లబ్ధిదారులకు తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో బటన్ నొక్కి నిధుల జమ చేశారు. అర్హత కలిగిన ఏ ఒక్క లబ్ధిదారుడు నష్టపోకూడదని.. ప్రతిఒక్కరికి సంక్షేమ ఫలాలు అందాలన్నారు.
- తప్పు చేశానంటూ.. పరిటాల సునీత కాళ్లు పట్టుకున్న వ్యక్తి.. ఎక్కడంటే?
Paritala Sunitha: మాజీ మంత్రి పరిటాల సునీత నిర్వహించిన "ఇదేం కర్మ రాష్ట్రానికి" కార్యక్రమంలో అనూహ్య సంఘటన చోటుచేసుకుంది. టీడీపీ నుంచి వైసీపీలోకి చేరి తప్పు చేశానని ఓ వ్యక్తి సునీత కాళ్ల మీద పడి క్షమాపణ అడిగారు. ఈ ఘటన అనంతపురం జిల్లాలో జరిగింది.
- పెద్దపులి దాడిలో ఆవు మృతి.. ఆందోళనలో గ్రామస్థులు
Tiger killed a cow: అన్నమయ్య జిల్లా రామసముద్రం మండలంలోని వివిధ గ్రామాల ప్రజలకు పెద్దపులి కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. పులి భయంతో ఆయా గ్రామాల ప్రజలు వ్యవసాయ పనుల కోసం బయటకు వెళ్లాలంటే భయపడుతున్నారు. నాలుగు నెలల క్రితం పశువులపై దాడి చేసిన పులి.. మళ్లీ నిన్న రాత్రి పశువుల పాకపై దాడిచేసి ఆవును చంపింది.ఈ ఘటనతో అన్నమయ్య జిల్లాలోని దొడ్డిపల్లె ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
- తాగి నడిపితే జైలుకే..! తనిఖీలతో హడలెత్తిస్తున్న పోలీసులు
drunken driving cases: మద్యం తాగి వాహనాలు నడపొద్దని పోలీసులు పదే పదే చెబుతున్నా.. కొందరు పెడచెవిన పెడుతున్నారు. తాగి వాహనాలతో రోడ్లపైకి వస్తున్నారు. మత్తులో విహరిస్తూ ప్రమాదాలకు కారణమవుతున్నారు. ఇలాంటి వారి భరతం పట్టేందుకు తెలంగాణలోని పోలీసులు డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు ముమ్మరం చేశారు. కేసులు నమోదు చేస్తూ వాహనాలను స్వాధీనం చేసుకుంటున్నారు.
- విమానం దిగే సమయానికి బాంబు బెదిరింపు.. 2 గంటలు తనిఖీలు చేస్తే..
దిల్లో విమానాశ్రయానికి చేరుకున్న ఓ విమానంలో బాంబు ఉందన్న సందేశంతో ఒక్కసారిగా కలకలం రేగింది. రంగంలోకి దిగిన సిబ్బంది.. హుటాహుటిన ప్రయాణికులను ఖాళీ చేయించారు. అనంతరం రెండు గంటలపాటు శ్రమించి.. అది తప్పుడు వార్తగా గుర్తించారు.
- చాక్లెట్ గొంతులో ఇరుక్కొని చిన్నారి మృతి.. విషవాయువు పీల్చి గర్భస్థ శిశువు..
చాక్లెట్ గొంతులో ఇరుక్కుని ఏడాదిన్నర చిన్నారి మరణించింది. ఈ విషాదకర ఘటన మహారాష్ట్రలోని సతారాలో జరిగింది. ఉత్తారాఖండ్‌లో జరిగిన మరో ఘటనలో విషవాయువు పీల్చి గర్భస్థ శిశువు మరణించింది.
- ఇక నో క్వారంటైన్.. 'జీరో కొవిడ్'కు దూరంగా చైనా అడుగులు.. ఆంక్షలు ఎత్తివేత
కరోనా కేసుల సునామీతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నప్పటికీ జీరో కొవిడ్ విధానం నుంచి చైనా క్రమంగా దూరంగా జరుగుతోంది. విదేశాల నుంచి చైనాకు వచ్చే ప్రయాణికులకు.. వచ్చే నెల 8 నుంచి క్వారంటైన్ నిబంధనను ఎత్తివేస్తున్నట్లు చైనా ప్రకటించింది. కొవిడ్ మేనేజ్మెంట్ను క్లాస్ A నుంచి క్లాస్ Bకి తగ్గిస్తున్నట్లు చైనా జాతీయ హెల్త్ కమిషన్ ప్రకటించింది. తద్వారా కొవిడ్ రోగులు, వారితో సన్నిహితంగా మెలిగిన వారికి తప్పనిసరి క్వారంటైన్ సహా కొవిడ్ కేసులు నమోదయ్యే ప్రాంతాల్లో లాక్డౌన్ అవసరం లేకుండా పోయింది.
- ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నారా?.. అప్రమత్తంగా ఉండండి లేకుంటే కష్టమే!
ఇంటి నుంచే కావాల్సిన వస్తువులు తెప్పించుకునే వెసులుబాటు ఉండటంతో ఎంతోమంది ఆన్లైన్లో కొనేందుకు ప్రాధాన్యం ఇస్తున్నారు. దీన్ని ఆసరాగా తీసుకొని, మోసగాళ్లు వినియోగదారుల వ్యక్తిగత సమాచారాన్ని తస్కరించేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రజల కష్టార్జితాన్ని దోచుకునేందుకు కొత్త మార్గాలను అన్వేషిస్తున్నారు. వీటికి భయపడి డిజిటల్ లావాదేవీలు, ఆన్లైన్ కొనుగోళ్లు మానేయలేం. అందుకే, అనుక్షణం అప్రమత్తంగా ఉంటూ, సురక్షితంగా లావాదేవీలను పూర్తి చేసుకోవాలి.
- IPL mini auction: సీనియర్ క్రికెటర్ అసంతృప్తి.. ఎందుకలా చేశారంటూ..
ఐపీఎల్ మినీ వేలంలో తనను కొనుగోలు చేయకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశాడు సందీప్ శర్మ. ఏం అన్నాడంటే..
- సల్మాన్ క్రెడిట్‌ను కొట్టేసిన హీరోయిన్.. హత్తుకుని విషెస్ చెప్పిన షారుక్
బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ బర్త్‌డే పార్టీ గ్రాండ్‌గా జరిగింది. ఈ వేడుకలో షారుక్ ఖాన్ కూడా సందడి చేశారు.