ETV Bharat / state

ఈ అవార్డు మర్చిపోలేని జ్ఞాపకం.. వారి తర్వాత ఆయనే నాకు అన్ని: రాజేంద్రప్రసాద్​ - మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్‌

HERO RAJENDRA PRASAD COMMENTS ON NTR : నందమూరి తారక రామారావు పేరుతో అవార్డు తీసుకోవడం జన్మలో మర్చిపోలేనని సినీ నటుడు రాజేంద్రప్రసాద్ అన్నారు. గుంటూరు జిల్లా తెనాలిలో.. ఎన్టీఆర్ శతజయంతి చలనచిత్ర పురస్కార మహోత్సవంలో ఆయన పాల్గొన్నారు.

HERO RAJENDRA PRASAD COMMENTS ON NTR
HERO RAJENDRA PRASAD COMMENTS ON NTR
author img

By

Published : Mar 27, 2023, 12:35 PM IST

ఈ అవార్డు మర్చిపోలేని జ్ఞాపకం.. వారి తర్వాత ఆయనే నాకు అన్ని: రాజేంద్రప్రసాద్​

HERO RAJENDRA PRASAD COMMENTS ON NTR : నందమూరి తారక రామారావు పేరుతో అవార్డు తీసుకోవడం జన్మలో మర్చిపోలేని జ్ఞాపకం అని నటకిరిటీ, సినీ నటుడు రాజేంద్రప్రసాద్ అన్నారు. గుంటూరు జిల్లా తెనాలి పట్టణంలోని ఎన్​వీఆర్ కన్వెన్షన్ హాలులో ఎన్టీఆర్‌ శతాబ్ది చలనచిత్ర పురస్కార మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఏడాది పాటు శతజయంతి ఉత్సవాలు నిర్వహించుకోవడం ఎన్టీఆర్‌కే సాధ్యమన్నారు. ఆయనతో తనకున్న రెండు దశాబ్దాల అనుబంధాన్ని రాజేంద్రప్రసాద్​ గుర్తు చేసుకున్నారు.

ఎన్టీఆర్ తనతో మాట్లాడిన తర్వాతే కామెడీ హీరో అవ్వాలనే ఆలోచన వచ్చిందని తెలిపారు. రావణాసురుడిని హీరోగా చూపటం ఒక ఎన్టీఆర్​కే సాధ్యమన్నారు. గురువు, దైవం ఎన్టీఆర్​ అని.. ఎన్ని జన్మలెత్తినా నటుడిగాను ఎన్టీఆర్​తోనే కలిసుండాలని కోరుకుంటునన్నారు. ఆస్కార్ అవార్డు పొంది.. తెలుగు వాడి గౌరవాన్ని ప్రపంచ దేశాలకు తెలియజేసిన ఆర్​ఆర్​ఆర్​ చిత్ర యూనిట్​కి ఈ నేపథ్యంలో అభినందనలు తెలిపారు. సంవత్సరం పాటు ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలు మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ ఆధ్వర్యంలో జరగటం గర్వంగా భావిస్తున్నట్లు తెలిపారు.

కేంద్ర ప్రభుత్వ వివక్షతోనే నందమూరి తారక రామారావుకు భారతరత్న రాలేదని.. ఇప్పటికైనా ఆయనకు ఇవ్వాలని మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు డిమాండ్‌ చేశారు. తెనాలిలోని ఎన్‌వీఆర్‌ కన్వెన్షన్‌ సెంటర్‌లో నిర్వహించిన ఎన్టీఆర్‌ శతాబ్ది చలన చిత్ర పురస్కార ప్రదాన సభలో ఆయన ప్రసంగించారు. మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్‌.. సభకు అధ్యక్షత వహించారు. అన్న తెచ్చిన పలు చట్టాలను కేంద్ర ప్రభుత్వాలు కూడా అమలు చేశాయని శోభనాద్రీశ్వరరావు గుర్తు చేశారు.

అన్న వేసిన పునాదితోనే ప్రాంతీయ పార్టీలు దేశాన్ని శాసించే స్థాయికి ఎదిగాయని పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు అన్నారు. బీసీలు రాజకీయాల్లోకి రావాలని పిలుపునిచ్చి చట్ట సభల్లో అడుగు పెట్టేలా చేసిన మహనీయుడు ఎన్టీఆర్​ అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి వడ్డే శోభనాద్రిశ్వరరావు, ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు, నిర్మాత ఎస్ గోపాల్ రెడ్డి, ఎన్టీఆర్ సోదరుని కుమారుడు నందమూరి రాంప్రసాద్, సినీ రచయిత సాయి మాధవ్, నన్నపనేని రాజకుమారి, తదితరులు పాల్గొన్నారు.

సాయిబాబా గుడిలో ప్రత్యేక పూజలు: అంతకుముందు రాజేంద్రప్రసాద్ గుంటూరు జిల్లా మంగళగిరి మండలం పెదవడ్లపూడిలో పర్యటించారు. ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల్లో పాల్గొనేందుకు వెళ్తున్న క్రమంలో మార్గమధ్యలో గ్రామంలోని సాయిబాబా ఆలయాన్ని సందర్శించారు. అక్కడ స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ నిర్వహకులు దర్శన ఏర్పాట్లు చేసి.. రాజేంద్రప్రసాద్​కు తీర్థ ప్రసాదాలను అందజేశారు. అనంతరం గో సేవలో పాల్గొన్న ఆయన.. గోశాలలోని ఆవులకు అరటి పండ్లు తినిపించారు. గత 20 సంవత్సరాలుగా విజయవాడ-తెనాలి మార్గంలో వెళ్లే ప్రతీసారి గ్రామంలోని సాయిబాబా ఆలయానికి రావటం ఆనవాయితీగా మారిందన్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.