ETV Bharat / state

ఈనెల 5న పొగాకు బోర్డు పాలక మండలి భేటీ

ఈనెల 5న గుంటూరులో పొగాకు బోర్డు పాలక మండలి భేటీ కానుంది. ఛైర్మన్ యడ్లపాటి రఘునాథబాబు అధ్యక్షతన ఆన్​లైన్​ వేదికగా సమావేశం కానున్నారు. ఈ సీజన్​లో పొగాకు విస్తీర్ణం ఎంత ఉండాలనేది సమావేశంలో ఖరారు చేయనున్నారు

author img

By

Published : Aug 3, 2020, 8:53 PM IST

Tobacco Board Governing Council
యడ్లపాటి రఘునాథబాబు

పొగాకు బోర్డు పాలక మండలి సమావేశం ఈనెల 5వ తేదీన జరగనుంది. గుంటూరులోని బోర్డు కార్యాలయంలో జరిగే ఈ సమావేశంలో ఛైర్మన్ యడ్లపాటి రఘునాథబాబుతో పాటు పాలకమండలి సభ్యులు, పొగాకు బోర్డు అధికారులు పాల్గొంటారు. ఈ సీజన్​లో పొగాకు విస్తీర్ణం ఎంత ఉండాలనేది సమావేశంలో ఖరారు చేయనున్నారు. గతేడాది కంటే సాగు విస్తీర్ణం తగ్గించే అవకాశాలున్నాయి.

అంతర్జాతీయ ఎగుమతులు, కొనుగోళ్లలో వచ్చిన తగ్గుదల కారణంగా పొగాకు మిగిలిపోకుండా ఉండాలంటే సాగు తగ్గించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అలాగే రాష్ట్రంలో మార్కెటింగ్ శాఖ తరపున కూడా పొగాకు కొనుగోళ్లు ప్రారంభించిన తర్వాత ఎలాంటి ఫలితాలు వచ్చాయనే దానిపైనా సమావేశంలో సమీక్షించనున్నారు. కరోనా నేపథ్యంలో ఆన్ లైన్ ద్వారా సమావేశం నిర్వహించనున్నారు.

ఇదీ చదవండి

రాజధానిపై ఎన్నికలకు వెళ్దాం.... 48 గంటల్లో తేల్చండి: చంద్రబాబు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.