మూడు రాజధానులకు మద్దతుగా ఉద్యమం చేస్తున్నవారిలో కొందరు చంద్రబాబు వాహనశ్రేణిని అడ్డగించేందుకు యత్నించారు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గురువారం ఉద్దండరాయునిపాలెంలోని రాజధానికి శంకుస్థాపన చేసిన ప్రాంతం నుంచి రాయపూడికి వెళ్తున్న సమయంలో కొంత మంది వ్యక్తులు బాబుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రహదారిపైకి దూసుకొచ్చేందుకు ప్రయత్నించగా పోలీసులు వారిని ఆపారు. చంద్రబాబు కాన్వాయ్ వెళ్లేవరకు వారిని కట్టిడి చేసిన పోలీసులు అనంతరం వారిని అదుపులోకి తీసుకున్నారు.
బహుజన పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఉద్యమిస్తున్న తాము చంద్రబాబును అడ్డుకునేందుకు ప్రయత్నించగా పోలీసులు అరెస్టు చేశారని ఎస్‌డీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ఎం.గురునాథం తెలిపారు.
ఇదీ చదవండి : జనభేరి...అమరావతి ఉద్యమ స్ఫూర్తితో మారుమోగి