ETV Bharat / state

'తెనాలి కొవిడ్ ఆసుపత్రిలో పీపీఈ కిట్ల కొరత లేదు' - తెనాలిలో నర్సుల ఆందోళనపై విచారణ వార్తల

తెనాలి కొవిడ్ ఆసుపత్రిలో పీపీఈ కిట్ల కొరత లేదని ఏపీ వైద్య విధాన పరిషత్ కమిషనర్ రామకృష్ణారావు స్పష్టం చేశారు. ఇటీవల ఆసుపత్రిలో నర్సుల ఆందోళనపై ఆయన విచారణ జరిపారు.

ఏపీ వైద్య విధాన పరిషత్ కమిషనర్ రామకృష్ణారావు

author img

By

Published : Jul 27, 2020, 8:33 PM IST

రాష్ట్రంలోని కొవిడ్ ఆసుపత్రుల్లో పీపీఈ కిట్ల కొరత లేదని ఏపీ వైద్య విధాన పరిషత్ కమిషనర్ రామకృష్ణారావు స్పష్టం చేశారు. గుంటూరు జిల్లా తెనాలి ఆసుపత్రిలో సౌకర్యాల కొరత, నర్సుల ఆందోళనపై ఆయన విచారణ జరిపారు. గుంటూరు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రుల సమన్వయకర్త ఈశ్వర ప్రసాద్​తో కలిసి తెనాలి ఆసుపత్రికి వచ్చి విచారణ చేపట్టారు. వ్యక్తిగత రక్షణ కిట్లు, మాస్కుల పంపిణీ రికార్డులు పరిశీలించారు. శనివారం నాడు ఆందోళన చేసిన నర్సింగ్ సిబ్బందితో మాట్లాడారు.

అంతర్జాతీయ వైద్య ప్రమాణాల ప్రకారం ఏయే విభాగాల్లో పనిచేసేవారికి ఎలాంటి పరికరాలు ఉండాలనే దానిపై నిబంధనలు ఉన్నాయి. ఆ మేరకు వాటిని పంపిణీ చేస్తున్నాం. అయినా సిబ్బంది ఎందుకు ఆందోళన చేశారనే దానిపై విచారణ జరిపాం. అయితే ఆసుపత్రిలో అధికారులు, సిబ్బంది మధ్య ఏదో సమన్వయ లోపం ఉన్నట్లు మాకు అనుమానం ఉంది- రామకృష్ణారావు, ఏపీ వైద్య విధాన పరిషత్ కమిషనర్

నర్సింగ్, పారామెడికల్ సిబ్బంది కొరత ఉన్న మాట వాస్తవమేనని అధికారులు అంగీకరించారు. కొత్తవారిని నియమించే ప్రక్రియ జరుగుతోందని తెలిపారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.