ETV Bharat / state

గుంటూరులో భూగర్భ డ్రైనేజీ పనుల్లో తీవ్ర జాప్యం..

గుంటూరు నగరంలో రూ.903.82 కోట్లతో చేపట్టిన భూగర్భ మురుగు నీటి నిర్వహణ పథకం (యూజీడీ) పనులు అతీగతి లేకుండా సాగుతున్నాయి. ఇప్పటికే పనుల నిర్వహణకు ఓసారి గడువు పొడిగించగా... చేపట్టాల్సిన పనులు ఇంకా 40 శాతానికి పైగా ఉన్నాయి. ఇవి పూర్తి స్థాయిలో పట్టాలెక్కడానికి ఇంకెన్నాళ్లు పడుతుందోమరి.

there is no completion of UGD works in guntur district
పట్టాభిపురం శివాలయం ప్రధాన రహదారిలో పడిన గుంతలు
author img

By

Published : Nov 9, 2020, 7:42 AM IST

Updated : Nov 9, 2020, 12:22 PM IST

గుంటూరు నగరంలో రూ.903.82 కోట్లతో చేపట్టిన భూగర్భ మురుగు నీటి నిర్వహణ పథకం (యూజీడీ) పనులు అతీగతి లేకుండా సాగుతున్నాయి. సకాలంలో గుత్తేదారు పనులు చేసేలా పర్యవేక్షించడంలో పురపాలక- ప్రజారోగ్య ఇంజినీరింగ్‌ విభాగం (పబ్లిక్‌హెల్త్‌) వైఫల్యాన్ని మూటగట్టుకుంది. 2016 సెప్టెంబరు 8న పనుల నిర్వహణకు ఒప్పందం కుదుర్చుకుని 2019 సెప్టెంబరు నాటికి పనులు పూర్తి చేసేలా గడువు విధించారు. ఇప్పటికే ఓసారి గడువు పొడిగించారు. ఇప్పటికీ చేపట్టాల్సిన పనులు 40 శాతానికి పైగా ఉన్నాయి. ఇవి పూర్తి స్థాయిలో పట్టాలెక్కడానికి ఇంకెన్నాళ్లు పడుతుందోమరి.

ఎందుకు నిలిచాయంటే..

గుత్తేదారుకు ప్రస్తుతం రెండు బిల్లులు పెండింగ్‌ పడ్డాయి. ఒకటి రూ.16.51 కోట్లు, మరొకటి రూ.12.44 కోట్లు. ఈ రెండు బిల్లులు చెల్లిస్తేనే పనులు చేపడతామంటున్నారు. గుత్తేదారు నుంచి మొబిలైజేషన్‌ అడ్వాన్సులు ఇంకా ప్రభుత్వానికి రూ.31.16 కోట్లు రావాల్సి ఉన్నాయి. ఈ విషయాన్ని గుర్తు చేసి పనుల పూర్తికి ఒత్తిడి తేవాల్సిన యంత్రాంగం మెతక వైఖరిని అవలంబిస్తోంది.

జనం అవస్థలు

యూజీడీ పనులు ఏళ్ల తరబడి కొనసాగుతుండడంతో నగరవాసులకు తీవ్ర అసౌకర్యం ఏర్పడుతోంది. రహదారులన్నీ తవ్వి పైపులైన్లు వేశారు. తిరిగి వాటిని పునరుద్ధరించలేదు. వర్షం పడితే చాలు రోడ్లన్నీ చిత్తడిగా మారుతున్నాయి. కనీసం వాహనాలు నడపడానికి వీల్లేకుండా ఉంటున్నాయి.

ప్రజాప్రతినిధుల బాధ్యత...

నెల రోజుల నుంచి పనులు పూర్తిగా నిలిచిపోయాయి. పనులు సకాలంలో పూర్తయ్యేలా జోక్యం చేసుకోవాలంటూ ఎంపీ గల్లా జయదేవ్‌ ఇటీవల కేంద్ర మంత్రికి లేఖ రాశారు.

చొరవ అవసరం...

నగర పరిధిలో ఉన్న ముగ్గురు ప్రజాప్రతినిధులు చొరవతీసుకుని ముఖ్యమంత్రితో చర్చిస్తే తప్ప పనుల్లో కదలిక రాదు. ఐదు ఎస్టీపీల్లో ఒక్కటీ పూర్తికాలేదు. ఒక్కటి పూర్తయినా దాని పరిధిలో చేపట్టిన పైపులైన్లు, ఇన్‌స్పెక్షన్‌ ఛాంబర్లు, మ్యాన్‌హోళ్ల పనులు ఎలా ఉన్నాయో ప్రయోగాత్మకంగా పరిశీలించవచ్చు. కానీ ఒక్కటీ సవ్యంగా పూర్తికాకపోవడంతో అసలు చేపట్టిన పనుల్లో నాణ్యత, లోపాలు ఏమిటో తెలియకుండా ఉన్నాయి. పనులు ఇంత నత్తనడకన సాగడానికి కారణాలేమిటి? గుత్తేదారు ఎందుకు వేగవంతం చేయడం లేదు? యంత్ర పరికరాలు, కార్మికులు ఏమేరకు ఉన్నారో పరిశీలించి సమీక్షించాల్సి ఉంది.

రహదారుల పునరుద్ధరణ పనులు

* నగరంలో 158.21 కి.మీ పరిధిలో ఉన్న సీసీ రహదారులు ధ్వంసం చేసి పైపులైన్లు, మ్యాన్‌హోల్స్‌ నిర్మాణాలు, ఇన్‌స్పెక్షన్‌ ఛాంబర్లు నిర్మించారు. ఇందుకుగాను 138.01 కి.మీ పరిధిలో పునరుద్ధరించారు. ఇంకా 20.20 కి.మీ చేయాలి.
* బీటీ రహదారులు 43.11 కి.మీ లక్ష్యానికి 9.92 కి.మీ వేశారు. 33.18 కి.మీ పరిధిలో పనులు చేపట్టాలి.
* డబ్ల్యూబీఎం రహదారులు 6.39 కి.మీకు 6.39 కి.మీ నిర్మించారు.
* ఆర్‌అండ్‌బీ రహదారులు 15.94 కి.మీ గాను 13.27 కి.మీ పూర్తయ్యాయి. ఇంకా 2.67 కి.మీ పరిధిలో పనులు మిగిలి ఉన్నాయి.
* జీఎంసీ రహదారులు 282.59 కి.మీ గాను 101 కి.మీ పరిధిలో నిర్మాణాలు పూర్తయ్యాయి. 181.59 కి.మీ పరిధిలో ఇంకా చేపట్టాలి.

UGD works in guntur district
UGD works in guntur district

ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాం

గుత్తేదారు పనులు నిలుపుదల చేశారు. ఈ విషయం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాం. రెండు బిల్లులు పెండింగులో ఉన్నాయి. అవి చెల్లించాలని కోరుతున్నారు. సకాలంలో పనులు చేయలేదని నోటీసులు ఇచ్చి వివరణ కోరుతున్నాం. తిరిగి పనులు వేగవంతం చేయడానికి ఉన్నత స్థాయిలో చర్చిస్తున్నారు.

- సంపత్‌కుమార్‌, కార్యనిర్వాహక ఇంజినీర్‌, ప్రజారోగ్య ఇంజినీరింగ్‌ విభాగం, గుంటూరు సర్కిల్‌

ఇదీ చదవండి:

బిల్డ్ ఏపీ మిషన్‌.. పలు శాఖలకు చెందిన భూముల వేలం..!

Last Updated : Nov 9, 2020, 12:22 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.